TS ICET COUNSELING 2022 SCHEDULE RELEASED
TS ICET: 8 నుంచి టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్
* షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 8 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తొలి విడత కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం అక్టోబరు 8 నుంచి 12 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుందని తెలిపింది. అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. బీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐ-సెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)ను తెలుగు రాష్ట్రాల్లో జులై 28న తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 76,160మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడత పరీక్షకు 90.93 శాతం, రెండో విడత పరీక్షకు 91.43 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐసెట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఆగస్టు 4న విడుదల చేసిన విషయం తెలిసిందే.
కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలివీ..
* అక్టోబరు 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్
* అక్టోబరు 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
* అక్టోబరు 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
* అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయింపు
* అక్టోబరు 23 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
* అక్టోబరు 23 నుంచి 25 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు
* అక్టోబరు 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు
* అక్టోబరు 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల