తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్‌లో గ్రూపు-3, 4 ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో సెప్టెంబరు 29న పేర్కొన్నారు. అర్హత గల జిల్లాలోని నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని బీసీ స్టడీ సెంటర్‌లో నేరుగా సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
TS BC STUDY CIRCLE: FREE COACHING TO TSPSC GROUPS ASPIRANTS
TS BC STUDY CIRCLE: FREE COACHING TO TSPSC GROUPS ASPIRANTS
You might also check these ralated posts.....