NSKTU UG ADMISSION NOTIFICATION 2022 RELEASED
NSKTU: జాతీయ సంస్కృత వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
సీయూఈటీ – 2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
1) శాస్త్రి: 616 సీట్లు
2) బీఏ ఆనర్స్: 22 సీట్లు
3) బీఎస్సీ కంప్యూటర్: 22 సీట్లు
4) బీఎస్సీ యోగా: 44 సీట్లు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో 10+2/ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సరైన సీయూఈటీ- 2022 స్కోరు ఉండాలి.
వయసు: కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో విధానంలో దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: సీయూఈటీ-2022 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు..
♦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2022.
♦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.10.2022.