JoSAA Counselling 2022 Registration Begins Today

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 JoSAA Counselling 2022 Registration Begins Today  

జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) సెప్టెంబరు 12న ప్రారంభించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది. 

జోసా’ కౌన్సెలింగ్‌లో భాగంగా.. జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సెప్టెంబరు 12 నుంచి తమకు నచ్చిన విద్యాసంస్థలో సీటు కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. తదనంతరం విద్యార్థుల అవగాహన కోసం మాక్‌ సీటు అలకేషన్‌ను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 18న మొదటి విడత మాక్ సీట్ల కేటాయింపు, సెప్టెంబరు 20న రెండో విడత మాక్ సీట్లను ప్రకటించనున్నారు. సెప్టెంబరు 20తో ఆప్షన్ల నమోదు ప్రకియ ముగియనుంది. సెప్టెంబరు 21 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 6 రౌండ్లలో కౌన్సెలింగ్‌‌ కొనసాగనుంది. సెప్టెంబరు 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. 

జోసా కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

JoSAA Online Registration Link


అధికారిక వెబ్‌సైట్

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

JoSAA కౌన్సెలింగ్ ఇలా..

 1వ రౌండ్‌ : సెప్టెంబరు 23 నుంచి 27 వరకు

♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు

♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3 నుంచి 7 వరకు

♦ 4వ రౌండ్‌: అక్టోబరు 8 నుంచి 11 వరకు

 5వ రౌండ్‌: అక్టోబరు 12 నుంచి 15 వరకు

♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. 

6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:

♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న

♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28న

♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3న

♦ 4వ రౌండ్‌: అక్టోబరు 8న

♦ 5వ రౌండ్‌: అక్టోబరు 12న

♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16న

error: Content is protected !!