JEE Advanced Result 2022: JEE Advanced Results on 11th september
JEE Advanced 2022 Result: ఈనెల 11న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు.. ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల
JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ కీ ఆగస్టు 28న శనివారం విడుదలైంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో జేఈఈ అడ్వాన్స్డ్ కీని చూసుకోవచ్చు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహించింది. కాగా.. ఐఐటీ బాంబే తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్స్ విడుదల చేసింది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2022 పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. లాగిన్ డీటైల్స్ సాయంతో తమ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక.. జేఈఈ అడ్వాన్డ్స్ తుది ఆన్సర్ కీ, ఫలితాలను.. సెప్టెంబర్ 11న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు.