DEO ELURU GIVEN INSTRUCTIONS ON MDM/TMF REPORTS and Key ponts to inspection officers
జిల్లా విద్యాశాఖాధికారి,ఏలూరు జిల్లా ఏలూరు వారి ఉత్తర్వులు
ప్రస్తుతం: శ్రీమతిఆర్ఎస్ గంగాభవాని, ఎం.ఎస్సి, బి.యిడి.,
ఆర్.సి. నెం.3822/B2 (MDM&SS)/2022-4
తేదీ:13-09-2022
విషయం:-పాఠశాల విద్య – జగనన్న గోరుముద్ద (MDM) IMMS App నందు నమోదు గావించవలసిన
MDM &TMF రిపోర్ట్ ల గురించి.
సూచిక:- 1. డైరెక్టర్ ఎండిఎం &ఎస్ఎస్, ఆం.ప్ర., విజయవాడ వారి మెమో.నెం.ESE02-27021/51/2021
-MDM-CSE, తేదీ.09-01-2022 (చీక్కీ).
2. ఈ కార్యాలయపు ఉత్తర్వులు ఆరిసి.నెం 7215/MDM/2020, తేదీ.11.01.2022.
3.డైరెక్టర్, ఎండిఎం &ఎస్ఎస్, ఆం.ప్ర., విజయవాడ వారి ఉత్తర్వులు ఆరిసి. నెం. ESE02-
_27021/85/2021-MDM-CSE, తేదీ.13-07-2022(కోడిగుడ్లు).
4. ఈ కార్యాలయపు ఉత్తర్వులు ఆర్.సి. నెం 3822/B2 /MDM&SS/2022, తేదీ.28.07.2022.
5. ఈ కార్యాలయపు ఉత్తర్వులు ఆర్ని. నెం 3822/B2 /MDM&SS/2022, తేదీ.02.08.2022.
6. ఈ కార్యాలయపు ఉత్తర్వులు ఆరిసి. నెం 3822/B2 /MDM&SS/2022, తేదీ.26.08.2022.
7. డైరెక్టర్, ఎండీఎం &ఎస్ఎస్, ఆం.ప్ర., విజయవాడ వారి ఉత్తర్వులు ఆరిసి. నెం. RSE02-
27021/8/201MDM, తేదీ.03-09-2022(కోడిగుడ్లు).
పై సూచికల ద్వారా గౌరవ డైరెక్టర్, ఎండీఎం &ఎస్ఎస్, ఆం.ప్ర., విజయవాడ వారు ఏలూరు జిల్లా యందు
కొంతమంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు IMMS App నందు MDM inspection, TMF ఫోటోస్ capturing చెసియుండటము లేదని తెల్పియున్నారు.
జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు మరియు పాఠశాలల ఉపతనిఖీ అధికారుల వారికి మరియొక్కసారి
తెలియజేయునది ఏమనగా:
1. IMMS యాప్ నందు MDM డైలీ అటెండన్స్ వేయునప్పుడు ప్రతి రోజు MDM inspection కూడా తప్పని
సరిగా చేయవలెను.
2. TMF photos capturing కూడా తరుచుగా కొంత మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు IMMS
Upload చేయటము లేదు.
3. MDMడైలీ అటెండన్స్ ను ప్రతి రోజు పాఠశాల సమయం నందు పూర్తి గావించవలెను.
4. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు పాఠశాలల ఉపతనిఖీ అధికారులు తమ
పరిధిలో గల ” టిక్కెట్స్ “ను ఎప్పటికప్పుడు close చేయవలేను.
5. కొంతమంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు 15 రోజులు పైబడి నుంచి అసలు “MDM inspection” చేసి
యుండటము లేదు. అట్టివారి వివరములను ఈ ఉత్తర్వులతో జతపరచడమైనది. మండల విద్యాశాఖాధికారులు
ఆ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా ఆదేశించడమైనది.
6. కోడిగుడ్లును సప్లయి దారుడు నెలకు మూడు సార్లు సప్లయి చేయవలేను లోగడ పలుమార్లు ఈ విషయమై
తమకు సూచనలు జారీచేయడమైనది. సదరు ఉత్తర్వులలోని తేదీలలో వర్కింగ్ రోజులను లెక్కించి మాత్రమే
కోడిగుడ్లును తీసుకొనవలెను. కోడిగుడ్లును తీసుకున్న వెంటనే IMMS యాప్ నందు నమోదు చేయవలెను.
7. చిక్కిలను నెలకు రెండు సార్లు తీసుకొనవలెను. సప్లయిదారుడు నుంచి చిక్కిలు తీసుకున్న వెంటనే IMMS
App నందు నమోదు చేయవలెను. ప్యాకింగ్ విషయములో గతంలో యిచ్చిన ఉత్తర్వులను
అనుసరించవలసినదిగా తెల్పడమైనది.
ఆర్ సినం 2/TMF / 2022,
తేదీ: 13-09-2022
విషయము: MDM/TMF నిర్వహణలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు పర్యవేక్షణాధికారులు
తీసుకొనవలసిన కొన్ని ముఖ్య అంశములపై సూచనలు జారీ చేయుటగురించి.
జిల్లా యందుగల అందరు ఉపవిధ్యాశాఖాధికారులు మండల విద్యశాఖాధికారులు, పాఠశాల తనిఖీ అధికారి
ఏలూరు వారులకు గతములో MDM / TMF నిర్వహణకు సంబందించి సూచనలు ఇచ్చినపటికి అనేక లోపములు
పదేపదే గమనించుట జరుగుచున్నది. కావున వీటిపై ఈ క్రింది విధముగా సూచనలు జారీ చేయడమైనది.
1. MDM తనిఖీ సమయములో విద్యార్థుల భోజనము చేయు మధ్యలో చెప్పులు మరియు బూట్లు ధరించి
నడవవలదు.
2. ప్రతిరోజు పర్యవేక్షణాధికారి విజిట్లను IMMS APP ద్వారా, మరియు DEO వారికి EXCEL
SHEET WITH PHOTOS పంపవలెను.
3. వంటవారు మాస్కు ధరించియుండవలెను మరియు తలకు ఏదేని వస్త్రముతో జుట్టు రాలి
ఆహారపదార్ధములలో పడకుండా జాగ్రత వహించవలెను.
4. ప్రతి రోజు మెనూ నందు నిర్దేశించిన ఆహార పదార్ధములుమాత్రమే వండి విద్యార్థులకు వడ్డించవలెను.
5. కోడి గ్రుడ్లు పై పెంకు తీసిమాత్రమే వడ్డించవలెను.
6. మెనూ యందు తప్పు జరిగినయడల జిల్లా కార్యాలయమునుండి ఫోను ద్వారా సమాచారము అందుకొనిన
వెంటనే తగిన వివరణతోకూడిన లేఖను WHATSAPP ద్వారా సమర్పించవలెను.
7. ఎట్టి పరిస్థితులయందు విద్యార్థులు హాజరుతోపాటుగా టాయిలెట్ల ఫోటోలు 1గం. లోగా IMMS ద్వారా
అప్లోడ్ చేయించవలెను. ఆ రోజు ఫోటోలు అప్లోడ్ చేయనియడల అందుకు సంబందించిన సమాచారము
మండల గ్రూప్ ద్వారా కారణము తెలుపవలెను.
8. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు MDM వివరములు IMMS APP ద్వారా అప్లోడ్ చేసినవెంటనే
HM INSPECTION REPORT కూడాఅప్లోడ్ చేయవలెను. కొంతమంది ప్రధానోపాధ్యాయులు ఈ
విషయములో అలసత్వము వహించుచున్నారు.
9. ప్రతి రోజు ఆయాలకు చెందిన హాజరును డైరెక్టర్ వారిచే జారీ చేయబడిన సూచనల మేరకు IMMS
APP ద్వారా తప్పనిసరిగా నమోదు చేయవలెను. లేనియడల ఆయాలకు చెందిన గౌరవభృతి
చెల్లించుటలో వచ్చే ఇబ్బందిలకు ప్రధానోపాధ్యాయులు బాద్యులగుదురు.
10. త్వరలో TMF CLEANING CHEMICALS/CLEANING TOOLS/BATHROOM
PLASTIC ACCESSORIES/ GLOVES AND MINI BRUSHES అందిన వెంటనే
సంబంధిత పాఠశాల లేదా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వారు రిజిస్టర్ నందు నమోదు చేసి తగిన
PACKNOWLEDGEMENT MEO/DI వారి ద్వారా ఈ కార్యాలయమునకు పంపవలెను.
11. చాలా మంది ఉపాధ్యాయులు 3గం తదుపరి వారి ఫోనును SWITCH OFF నందు ఉంచుట
గమనించడమైనది. అత్యవసర సమాచారము పొందుటలో ఇబ్బంది కలుగుచున్నది.
12. ప్రధానోపాధ్యాయుడు తాత్కాలిక సెలవులో వెళ్ళిన సమయములో ఇంచార్జ్ ఉపాధ్యాయులు
MDM/TMF వివరములు సమర్పించుటలో అలసత్వము చూపుచున్నారు. దీని పై సూచనలు
పలుమార్లు జారీ చేయుట జరిగినది.
Scanned with CamScanner
13. కొన్ని వివరములు అత్యవవసరముగా DEO ఏలూరు వారికి పంపవలసినదిగా కోరిననూ
సమర్పించకపోవుటలో DIRECTOR MDM & SS VIJAYAWADA వారికి పంపు
సమాచారము పంపలేకపోవుటకు తనిఖీ అధికారులు బాధ్యత వహించవలసియుండును.
14. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కార్యాలయమునుండి పంపబడుచున్న ప్రతి సమాచారము
తప్పనిసరిగా చూసి అనుసరించులా సూచనలు జారీ చేయవలెను.
15. కోడిగ్రుడ్లు ఏ రోజు తీసుకొనినారో అదే రోజున IMMS APP ద్వారా వివరములు అప్లోడ్ చేయవలెను.
16. ప్రతిసారి హాజరు నమోదు ప్రధానోపాధ్యాయుని తనిఖీ నమోదు, TMF ఫోటోలు నమోదు చేయని
ప్రధానోపాధ్యాయుల మరియు పాఠశాలల వివరములు ప్రతిరోజు WHATSAPP ద్వారా కోరుట
జరుగుచున్నది అందిలో కొంతమంది ప్రధానోపాధ్యాయులు తరచు వచ్చుచున్నారు. ఈ పాఠశాలల గూర్చి
DIRECTOR, MDM &SS వారు వివరణ కొరియున్నారు. సదరు ప్రధానోపాధ్యాయులు ఈ
విషయములను గమనించవలసినదిగా తెలియజేయుడమైనది.
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More