CUET UG RESULTS RELEASED
CUET UG Result 2022: సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల, రిజల్ట్ ఇక్కడ చూసుకోండి!
శవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 259 నగరాల్లో, 489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6 విడతల్లో CUET-2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
దేశంలోని వివిధ ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు సెప్టెంబర్16న వెలువడ్డాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సీయూఈటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 15న రాత్రి 10 గంటలకు ఫలితాలను ప్రకటిస్తామని అధికారిక ప్రకటన చేసినప్పటికీ, సెప్టెంబరు 16న ఉదయం ఫలితాలను NTA ప్రకటించింది.
CUET UG 2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
CUET UG 2022 పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 259 నగరాల్లో, 489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6 విడతల్లో కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-2022) నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 15, 16,19, 20; ఆగస్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో CUET -2022 పరీక్షలు నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4 నుంచి 6 వరకు వాయిదా పడిన సీయూఈటీ-యూజీ(CUET-UG ) పరీక్షను ఆగస్టు 24, నుంచి 30 వరకు నిర్వహించారు.
ఈ పరీక్ష కోసం దాదాపు 14,90,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,68,201 మంది పరీక్షలకు హాజరయ్యారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి దూరవిద్య, సార్వత్రిక, ఆన్‌లైన్ విధానంలో పూర్తిచేసిన డిగ్రీ/పీజీ కోర్సులను రెగ్యులర్ డిగ్రీ/పీజీ కోర్సులతో సమానంగానే పరిగణిస్తామని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) తెలిపింది.
మార్కుల కేటాయింపు ఇలా..
♦ అభ్యర్థి రాసిన సరైన సమాధానానికి ఐదు మార్కులు (+5) కేటాయిస్తారు.
♦ ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్క్ మైనస్ (-1) చేస్తారు.
♦ ఆన్సర్ చేయకుండా వదిలివేసిన ప్రశ్నలకు ఎలాంటి మార్కులు ఇవ్వరు.
♦ ఫైనల్ రిజల్ట్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ సరైనవని తేలితే, సరైన ఆప్షన్స్‌లో దేనినైనా గుర్తించిన వారికి మాత్రమే ఐదు మార్కులు ఇస్తారు.
♦ ప్రశ్నకు ఇచ్చిన అన్ని ఆప్షన్స్ సరైనవని గుర్తిస్తే.. ప్రశ్నను ప్రయత్నించిన వారందరికీ ఐదు మార్కులు (+5) కేటాయిస్తారు.
♦ ఆప్షన్స్‌లో ఏదీ సరైనది కాకపోయినా లేదా ఏదైనా ఒక ప్రశ్న తప్పుగా వచ్చినా లేదా క్వశ్చన్‌ను డ్రాప్ చేసినా.. డ్రాప్ చేసిన ప్రశ్నను ప్రయత్నించిన అభ్యర్థులందరికీ ఐదు మార్కులు (+5) ఇవ్వనున్నారు.