సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 110
1) ఐటీ: 33 పోస్టులు
2) ఎకనామిస్ట్: 03 పోస్టులు
3) డేటా సైంటిస్ట్: 01 పోస్టు
4) రిస్క్ మేనేజర్: 21 పోస్టులు
5) ఐటీ ఎస్‌ఓసీ అనలిస్ట్: 01 పోస్టు
6) ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్: 01 పోస్టు
7) టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్): 15 పోస్టులు
8) క్రెడిట్ ఆఫీసర్: 08 పోస్టులు
9) డేటా ఇంజినీర్: 09 పోస్ట్లు
10) లా ఆఫీసర్: 05 పోస్టులు
11) సెక్యూరిటీ: 05 పోస్టులు
12) ఫైనాన్షియల్ అనలిస్ట్: 08 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్టీ).
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.09.2022.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 17.10.2022.
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2022, నవంబరులో.
ఇంటర్వ్యూ తేదీ: 2022, డిసెంబరులో.