Azadi Quest games ‘Match 3 Puzzle’ and ‘Heroes of Bharat’
Heroes of Bharat: దసరా సెలవుల సద్వినియోగానికి ‘హీరోస్ ఆఫ్ భారత్’!
* విద్యార్థుల కోసం గేమింగ్ యాప్
* ‘ఆజాదీ క్వెస్ట్’ పేరిట అందుబాటులోకి
త్వరలో ప్రారంభం కానున్న దసరా సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ క్వెస్ట్’ పేరిట సమరయోధుల వివరాలు తెలిపే యాప్ రూపొందించింది. దీని ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు.. స్వాతంత్య్ర సమరం తాలూకు ఘట్టాలను తెలుసుకోవడంతో పాటు తమకు తెలిసిందెంత అనే విషయం మదింపు చేసుకోవచ్చని విద్యాశాఖాధికారులు తెలిపారు. భారత స్వాతంత్య్ర సమర పోరాటం, మన యోధులు, వీరవనితల గురించి తెలుసుకోవడంతో పాటు తమ ధారణశక్తి ఎంత ఉందో అంచనా వేసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇది ఆంగ్లం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. సెల్‌ఫోనులో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు కొనసాగించొచ్చు. ఇందులో ‘హీరోస్ ఆఫ్ భారత్’ అని ఆంగ్లంలో కనిపిస్తుంది. తర్వాత ఆటకు సంబంధించిన నియమ, నిబంధల పుట కనిపిస్తుంది. మొదటి పోటీలో పదిమంది దేశభక్తుల ఫొటోలను కూర్చి వారి వివరాలు నాలుగేసి బహుళైచ్ఛిక సమాధానాలు తరహాలో పొందుపరిచారు. వీటిలో సరైన సమాధానాలు కనిపెట్టి వాటిపై ఎంటర్ నొక్కితే సరైనదా కాదా అని తెలిపి, సరైన సమాధానం ఏమిటో వివరించే ఏర్పాటుచేశారు. ఇలా పది ప్రశ్నలకు కనీసం ఆరింటికి సరైన సమాధానాలు ఇస్తే ‘సిల్వర్ ఆజాదీ వీర్ కార్డు’ను వర్చువల్‌గా ప్రదానం చేస్తారు. పదికి పది సరైన సమాధానాలు పొందుపరిస్తే ‘స్పెషల్ గోల్డెన్ ఆజాదీ వీర్ కార్డు’ పొందవచ్చు. ఓపికను బట్టి ఆటలు ఎన్నైనా ఆడుకోవచ్చు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ యాప్ ద్వారా మన దేశ చరిత్ర గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
AZADI QUEST GAMES APPS
DOWNLOAD ‘AZADIQUEST: MATCH 3 PUZZLE Android APP
DOWNLOAD ‘AZADIQUEST: MATCH 3 PUZZLE Android APP
DOWNLOAD ‘HEROS OF BHARATH’ Android APP