Audit of Nadu Nedu Phase-1 Schools:Task to be completed by HM, Welfare and Edn Asst/Ward Secretary and Eng. Asst/Amenities Secretary

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*//Audit of Nadu Nedu Phase-1 Schools//*
*//Task to be completed by HM, Welfare and Edn Asst/Ward Secretary and Eng. Asst/Amenities Secretary//*
*నాడు నేడు మొదటి విడత క్రింద అభివృద్ధి పనులు చేపట్టిన పాఠశాలల్లో, ఇంకనూ మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి, గ్రామాల్లో  వెల్పేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్, పట్టణాల్లో వార్డు సెక్రెటరీ ల ద్వారా ఆడిట్ చేయించాలని రాష్ట్ర విద్యా శాఖా మౌలిక సదుపాయాల కమీషనరు వారు  ఆదేశించియున్నారు. ఈ నెలలో ఆయా జిల్లా కలెక్టర్లు నిర్దేశించిన తేదీల లో జిల్లాలోని పాఠశాలల్లో ఈ పని పూర్తీ చేయడానికి జిల్లా  కలెక్టరు వారు క్రింది Timeline  నిర్దేశిస్తారు*
*1వ రోజు :* 
MIS లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్లు క్రింద ఇవ్వబడిన గూగుల్ షీట్ లో పేజ్-1 పాఠశాలలు ఏ సెక్రెటేరియేట్ పరిధిలోకి వస్తాయో తెలుపుతూ మధ్యాహ్నము 12 గంటల లోపు వివరాలు నింపాలి.  
*గూగుల్ షీటు లింకు:* 
 *ఏ జిల్లాకు సంబంధించిన గూగుల్ షీట్ లింకు ఆయా జిల్లాల నాడు నేడు  జిల్లా అధికారుల ద్వారా ఇవ్వబడుతుంది*
 
*2వ రోజు*
ఇందు వెంట జత పరచిన సర్కులర్ మరియు బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ యూజర్ మాన్యువల్ ను సదరు సెక్రెటరియేట్ ఉద్యోగులకు చేరవేయాలి.  సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 2వ రోజు ఆడిట్ నిమిత్తము వెల్ఫర్ అసిస్టెంట్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా ఆమ్నెటీస్ సెక్రెటరీ ని పాఠశాలకు ఆహ్వానించాలి. 
*3వ రోజు*
ముగ్గురు కలిసి బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ లో వెరిఫికేషన్ డిటైల్స్ పూర్తీ చేయాలి. పూర్తీ చేసిన అనంతరము, అందరూ సంతకాలు చేసి, తిరిగీ అప్లోడ్ చేయాలి. (స్టెప్ బై స్టెప్ ప్రొసీడర్ కోసం యూజర్ మ్యానువల్ రెఫర్ చేయండి) 
*4 వ రోజు :*
మండల విద్యా శాఖాధికారులు తమ మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఆడిట్ పూర్తీ అయినట్లు నిర్దారించాలి. 
*5 వ రోజు :*
ఈ రోజు నాటికి జిల్లాలో ఏ ఒక్క పాఠశాల ఆడిట్ పెండింగ్ వుండకూడదు. మొదటి విడత అన్ని పాఠశాలల ఆడిట్ 100% పూర్తీ కావాలి. 
*SPD SAMAGRA SHIKSHA, AMARAVATHI.*

error: Content is protected !!