APPSC ASSISTANT ENGINEERS Exam: ‘మళ్లీ పరీక్ష’ ఆదేశాల నిలిపివేత

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Exam: ‘మళ్లీ పరీక్ష’ ఆదేశాల నిలిపివేత

సహాయ ఇంజినీరు పోస్టుల భర్తీకి తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో తాజాగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం నిలిపేసింది. ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు.. అప్పీళ్లపై తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్‌ 21న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సహాయ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష నిర్వహించేలా 2021 అక్టోబరులో ఏపీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనను సవాలు చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన డి.శివశంకర్‌రెడ్డి తదితరులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

error: Content is protected !!