AP TET FINAL KEY:టెట్‌’ ఫలితాలు ఎప్పుడు? షెడ్యూలు ప్రకారం నేడే

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*📚✍️‘టెట్‌’ ఫలితాలు*
 *ఎప్పుడు?✍️📚*
*♦️షెడ్యూలు ప్రకారం నేడే*
*♦️కానీ, ఇప్పటికీ లేని స్పష్టత*
 *♦️విడుదలకాని ఫైనల్‌ ‘కీ*
*♦️’లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ*
 

*🌻అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి)*: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) ఫలితాల విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూలు ప్రకారం టెట్‌ ఫలితాలు బుధవారం విడుదల కావాలి. ఈ నెల 12నే ఫైనల్‌ ‘కీ’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే, ఇప్పటి వరకు ఫైనల్‌ ‘కీ’ రాలేదు. ఫలితాలపై అధికారులను వివరణ కోరగా బుధవారం ఫైనల్‌ ‘కీ’ విడుదల కావొచ్చని తెలిపారు. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో ‘టెట్‌’ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో 2018లో టెట్‌ నిర్వహించగా మళ్లీ ఈ ఏడాది టెట్‌ నిర్వహించారు. చాలా కాలం తర్వాత నోటిఫికేషన్‌ రావడంతో ఈసారి 5.25 లక్షల మంది టెట్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆ స్థాయిలో పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కేంద్రాలు ఏర్పాటు చేయలేక పోయింది. ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు కేవలం 150 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసింది. విచిత్రంగా అందులోనూ అనేక కేంద్రాలు ఒడిసా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కేంద్రాల్లో పెట్టింది. పైగా పరీక్షా కేంద్రాల సమాచారం ఇవ్వకపోవడంతో ఆలస్యంగా వెబ్‌సైట్‌ చూసిన అభ్యర్థులు ఇతర రాష్ర్టాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అయినప్పటికీ పాఠశాల విద్యాశాఖ పట్టించుకోలేదు. ఫలితంగా కొందరు వ్యవప్రయాసలకు ఓర్చుకుని ఇతర రాష్ర్టాలకు వెళ్లి పరీక్షలు రాస్తే… చాలా మంది హాజరుకాలేదు. దీంతో ఈసారి టెట్‌ రాసిన వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడినా పాఠశాల విద్యాశాఖ ఇప్పటికీ ఎంతమంది పరీక్షలు రాశారనే విషయాన్ని బహిర్గతం చేయలేదు. రాయనివారికి ఒక్కో పరీక్షకు రూ.500 చొప్పున కట్టిన ఫీజులు వృథా అయ్యాయి. చాలా వరకు అభ్యర్థులు రెండేసి పరీక్షలకు ఫీజులు కట్టారు. అంటే రాయనివారందరికీ దాదాపుగా రూ.వెయ్యి వృథా అయ్యాయి. మరోవైపు, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లోని టీచర్లకూ టెట్‌ సర్టిఫికెట్‌ ఉండాలనే నిబంధన పెట్టడంతో ఎక్కువ మంది టెట్‌ రాసేందుకు ముందుకొచ్చారు. కానీ నిర్వహణలో వైఫల్యంతో అభ్యర్థులు నిరాశకు గురయ్యారు.
నార్మలైజేషన్‌కు వారంటెట్‌ ఫైనల్‌ ‘కీ’ విడుదల చేశాక దాని ఆధారంగా పేపర్ల నార్మలైజేషన్‌ ప్రక్రియ చేపడతారు. దీనికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. అంటే టెట్‌ ఫలితాలు ఇంకో వారం వరకూ రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే, ఫలితాలు వాయిదా వేసిన విషయాన్ని కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించక పోవడం గమనార్హం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

error: Content is protected !!