*📚✍️మూడోతరగతిలో*
AP FLS REPORT 2022: FOUNDATIONAL LEARNING STUDY ANDHRAPRADESH REPORT
AP FLS REPORT 2022: FOUNDATIONAL LEARNING STUDY ANDHRAPRADESH REPORT
*క్యాలెండర్ గుర్తించేవారు 58%✍️📚*
*♦️ఆంగ్లంలో 72% పదాలు తప్పులు లేకుండా చదువుతున్నారు*
*♦️తెలుగులో జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందంజ*
*♦️కేంద్రం విడుదల చేసిన పునాది అభ్యసన అధ్యయనం-22లో వెల్లడి*
*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలో మూడోతరగతి చదువుతున్న విద్యార్థుల్లో 58% మంది క్యాలెండర్లోని నెల, తేదీ, రోజును సరిగా గుర్తించినట్లు కేంద్రం బుధ వారం విడుదల చేసిన పునాది అభ్యసన అధ్యయనం 22 (ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ) వెల్లడించింది. రాష్ట్రం లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కేంద్రీయ విద్యాల యాల్లో చదువుతున్న మూడో తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను అంచనా వేసేందుకు తెలుగు, ఆంగ్లం, ఒడియా, కన్నడ, ఉర్దూ భాషలు, గణితం సబ్జెక్టులపై కేంద్ర విద్యాశాఖ ఈ అధ్యయనం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంగ్లభాషలో 155 పాఠశాలల్లో 1,456 మంది, తెలుగుభాషలో 102 బడుల్లో 857 మంది విద్యార్ధులకు పలు అంశాలపై పరీక్షలు నిర్వహించింది. క్యాలెండర్లోని నెల, తేదీ. రోజును 58% సరిగ్గా చెప్పారు. వేరేవార్ సాయంతో 22% మంది చెప్పగా, 6% తప్పులు చెప్పారు, 14% అసలు సమాధానం చెప్పలేకపోయారు. కొంతలు, సమయాలపై ఇచ్చిన కూడికలు, తీసివేతల్లో కొంత వెనుకబడినట్లు ఈ సర్వే తెలిపింది. ఆంగ్ల భాషలో ఇచ్చిన 50 పదాల్లో సగటున 36 (72%) పదాలను తప్పులు లేకుండా చదవగలి గారు 80% పైగా పదాలను సరిగా చదవగలిగినవారు. 63% ఉండగా.. 50-80% చదవగలిగినవారు 17% ఉన్నారు. తెలుగుభాషలో జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందువరసలో నిలిచింది. 80-100 తెలుగు అక్షరాలను సక్రమంగా చదివినవారు 71% ఉండగా.. తప్పులు చదివి, వాటిని తామే సరిచేసుకుని 10-49 అక్ష రాలు చదివినవారు 8% ఉన్నారు. విద్యార్థులకు 50 పదాలు ఇవ్వగా.. స్పష్టంగా సరాసరిన 34 పదాలను చదవగలిగారు. 80% పదాలను సక్రమంగా చదివిన వారు 55% ఉన్నారు. మిగతావారు తడబాటుకు గుర వుతూ.. తప్పులను సరిచేసుకుంటూ చదివారు.
*♦️50 శాతం పైన బడికి కాలినడకే*
మూడో తరగతి చదివేవారిలో పాఠశాలలకు నడిచి వచ్చేవారు 55% ఉండగా.. సైకిళ్లపై వచ్చేవారు 0% ప్రజారవాణాలో వచ్చేవారు 8% కాగా.. సొంత వాహనాల్లో వస్తున్నవారు 21% ఉన్నారు.
▪️65% మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే
▪️ 40% బడుల్లోనే మెడికల్ గది సదుపాయం ఉంది
▪️ 51% పాఠశాలల్లోనే దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి..