22-09-2022 రాశి ఫలాలు

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
 22-09-2022 రాశి ఫలాలు
మేషం
 22-09-2022
వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
—————————————
వృషభం
 22-09-2022
వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
—————————————
మిధునం
 22-09-2022
వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
—————————————
కర్కాటకం
 22-09-2022
ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————
సింహం
 22-09-2022
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు.
—————————————
కన్య
 22-09-2022
మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారమున ప్రత్యర్థులు కూడా  మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు.
—————————————
తుల
 22-09-2022
వృత్తి వ్యాపారాలలో  ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
—————————————
వృశ్చికం
 22-09-2022
అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
—————————————
ధనస్సు
 22-09-2022
చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబసభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు.
—————————————
మకరం
 22-09-2022
చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ విషయంలో  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
—————————————
కుంభం
 22-09-2022
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
—————————————
మీనం
 22-09-2022
నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. దైవ చింతన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
—————————————
✍️AVB సుబ్బారావు 🕉️
📱9985255805🚩

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!