11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్ : పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు మంత్రి బొత్స హామీ
*📚✍️11 వేల మంది కాంట్రాక్టు*
*ఉద్యోగుల రెగ్యులర్✍️📚*
*♦️పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు బొత్స హామీ*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న 11వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీలకు హామీ ఇచ్చారు. కరోనాతో మరణించిన ఉపాధ్యాయ కుటుంబ సభ్యులకు కలెక్టర్ పూల్లోని ఖాళీల ద్వారా కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా గురువారం మండలిలో ఎమ్మెల్సీలు మంత్రిని కలిసి ఈ అంశాలపై చర్చించారు. త్వరలో 1468 మందికి కారుణ్య నియామకాలు కింద పోస్టింగులిస్తామని హామీ ఇచ్చారు. ఎయిడెడ్, గురుకుల, గ్రంథాలయ, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందికి పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచుతూ త్వరలో ఉత్తర్వులిస్తామని, ఎయిడెడ్ చట్ట సవరణ బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పారు. మంత్రిని కలిసిన వారి లో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, వై శ్రీనివాసులు రెడ్డి, ఐ వెంకటేశ్వరరావు, టీచర్ ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ ఉన్నారు. ఎయిడెడ్, ప్రభుత్వ రంగల సిబ్బంది 62 ఏళ్ల పెంపు అంశంపై కెఎస్ లక్ష్మణరావు, కారుణ్య నియామకాలు అంశాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీ వై శ్రీనివాసు లు రెడ్డి ప్రత్యేక ప్రస్తావన ద్వారా మండలి చైర్మన్ కొయ్య మోషేను రాజు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎయిడెడ్, గురుకుల, గ్రంథాలయ, ప్రభుత్వరంగరిటైర్డ్ ఉద్యోగులకు తొమ్మిది నెలల నుంచి పెన్షన్ రాలేదని లక్ష్మణరావు వివరించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
You might also check these ralated posts.....