08-09-2022 వ తారీఖున విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు నాడు నేడు సమీక్షా సమావేశములో జారీ చేసిన ఆదేశాలు
ఈ రోజు జరిగినటువంటి స్టేట్ లెవల్ నాడు- నేడు సమీక్షా సమావేశం లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు,
కమీషనర్ స్కూల్ ఇస్-ప్ర మరియు డైరెక్టరు గారు ఈ క్రింది ఆదేశాలను జారీ చేయడం జరిగినది.
మన బడి నాడు-నేడు పాఠశాలలో జరిగే అభివృద్ధి పనులలో అవినీతి సహించబడదు. ఎక్కడైనా ఎవరైనా విధులు
దుర్వినియోగానికి పాల్పడిన చో బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకొనబడును.
1. మన బడి నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హెచ్చు మొత్తం లో అడ్వాన్స్ ను తీసుకొని నగదు రూపంలో నిబంధనలకు
విరుద్ధంగా తమ వద్ద ఉంచుకున్నారు. నిబంధనల ప్రకారం రూ.5,000/- మించి సెల్ఫ్ చెక్ ఇచ్చి నగదు డ్రా చేయరాదు.
2. మన బడి నాడు-నేడు పాఠశాల ల కు చెందిన కొంతమంది ప్రధానోపాధ్యాయులు బ్లాంక్ చెక్ మెయింటెన్ చేస్తున్నారు. పేరెంట్స్ కమిటీ
సంతకాలు తీసుకొని బ్లాంక్ చెక్ మెయింటెన్ చేయడం విధుల దుర్వినియోగం క్రిందకు వస్తుంది.
3. మెటీరియల్ కొనుగోలు పేరుతో చెక్కు ద్వారా బ్యాంకు నుండి నగదు డ్రా చేసారు. కానీ మెటీరియల్ స్టాక్ స్కూల్ లో లేదు. ఇది విధుల
దుర్వినియోగం క్రిందకు వస్తుంది. భాద్యుల పై తగిన చర్యలు తీసుకొనబడును.
4. స్టాక్ రిజిస్టరు అనేది స్టాచుటరీ అబ్లిగేషన్ కాబట్టి స్టాక్ రిజిస్టరు మెయింటెన్ చేసి ఏ రోజు కు ఆ రోజు కొనుగోలు చేసినటువంటి
మెటీరియల్ ను అదే రోజు స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేయవలెను.
5. స్టీల్ మార్కెట్ రేటు కంటే 20% వరకు ఎక్కువ ధర కు కొనుగోలు చేసినట్లు గుర్తించడం జరిగినది. ఇలా జరిగినట్లు గుర్తించినచో
బాధ్యుల పై తగు చర్యలు తీసుకొనబడును.
6. మన బడి నాడు-నేడు పాఠశాల కు చెందిన కొంతమంది ప్రధానోపాధ్యాయులు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ టెక్నికల్ సలహా లేకుండా
అవసరమైన దాని కంటే హెచ్చు మొత్తం లో మెటీరియల్ కొనుగోలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ లేదా ఫీల్డ్ ఇంజనీర్స్
టెక్నికల్ సలహా మేరకే మెటీరియల్ కొనుగోలు చేయవలెను.
7. ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు M-Book రికార్డు చేస్తున్నందువలన డి.ఇ.ఇ. లు మరియు వారి పై అధికారులు నాడు నేడు స్కూల్ ల
లో జరిగే పనులను సరిగా పర్యవేక్షణ చేయడం లేదు. కలెక్టరు గారిని తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరియున్నారు.
8. అధికారులు మన బడి నాడు- నేడు పాఠశాల ను సందర్శించినప్పుడు ఫీడ్ బ్యాక్ నమోదు చేయుటకు ఒక ఆప్ ను తీసుకురావడం
జరిగినది. ఈ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇంజనీరింగ్ అధికారులు మరియు ఇతర అధికారులు స్కూల్స్ ను సందర్శించినప్పుడు
అబ్జర్వేషన్ ను అప్ లో నమోదు చేయవలెను.
9. మన బడి నాడు- నేడు పాఠశాల ల కొరకు మెటీరియల్ కొనుగోలు నిమిత్తం సర్కులర్ ను జారీ చేయడమైనది. సందర్శించిన
అధికారులు మెటీరియల్ కొనుగోలు, సర్కులర్ లోని నిబంధనలు మరియు నిర్దేశించిన ధరల ప్రకారం జరిగినదా లేదా అని పర్యవేక్షణ
చేయవలసినదిగా ఆదేశించడం జరిగినది.
10. మన బడి నాడు-నేడు పనుల నిమిత్తం భారీ ఎత్తున సిమెంట్ వస్తున్నది. ఈ సిమెంట్ స్టాక్ రిజిస్టరు లో నమోదు చేసి సిమెంటు రోజు
వారీ వినియోగాన్ని కూడా ప్రతి రోజు స్టాక్ రిజిస్టరు లో నమోదు చేయాలి. స్కూల్ తనిఖీ అధికారులు ఈ స్టాక్ రిజిస్టరు ను
పర్యవేక్షించవలెను.
11. స్కూల్ లో ఉన్నటువంటి సిథిలావస్థ లో ఉన్నటువంటి బిల్డింగ్స్, చెట్లు తొలగించినప్పుడు తద్వారా బయటబడిన నిర్మాణ సామాగ్రి
అనగా కొయ్యలు, తలుపులు, ద్వార బంధములు, స్టీల్ తదుపరి సామాగ్రి అకౌంట్ ఫర్ చేసి స్టాక్ రిజిస్టరు లో నమోదు చేయవలెను.
12. మొదటి దశలో నాడు నేడు స్కూల్ లో జరిగిన ఆడిట్ మిగిలిన స్కూల్ లో కూడా వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్
అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులు పూర్తి చేసి రేపటి లోగా డాక్యుమెంట్ అప్ లోడ్ చేయవలెను.
13. మన బడి నాడు-నేడు ఫేస్-II స్కూల్ లో కాంపౌండ్ వాల్ ఒక ప్రాజెక్టుగా ఇవ్వడం జరిగినది. అయితే కొన్ని పాఠశాలలకు కాంపౌండ్
వాల్ ఎస్టిమేట్ వేయకుండానే అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ తీసుకోవడం జరిగినది. కాబట్టి అటువంటి స్కూల్స్ కి క్రొత్తగా కాంపౌండ్ వాల్
ఎస్టిమేషన్ వేసుకోవడానికి కలెక్టరు గారు ద్వారా ప్రతిపాదనలు వస్తే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని
తెలియజేయడమైనది.