అద్భుత అస్త్రం.. ఆత్మవిశ్వాసం! ఉద్యోగం సంపాదించడంలో చెందుతున్న ఎక్కువమంది అభ్యర్థుల్లో ఉండే లోపాలూ, వాటిని అధిగమించే మెలకువలు ఇవీ… Unlocking…
బుద్ధుడు”ఆత్మ, ఆహాలనే అంశాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దేవుడొకరి ప్రత్యేక ప్రస్తావన తీసుకు రాలేదు. మనిషిని ఒకే నమ్మకానికి కట్టిపడవేయనీయలేదు. అటువంటి విలక్షణమైన తన ఆధ్యాత్మికతతో, పారమార్ధిక సత్యాలు అన్వేషించిన మహాప్రవక్త గౌతమబుద్ధుడు. ఆయన ప్రవచించినదంతా మతం అనడంకన్నా – మానవాళికి నిర్మించి ఇచ్చింది ఒక మహత్తరమైన దర్మపదం అనడం సముచితంగా ఉంటుంది.
బుద్ధుడు రాజకుమారుడిగా జన్మించిన గౌతము నామదేయుడు రాజ్యాన్ని, రాజ భోగాలను త్యజించి మనిషి బాధలకు మూలకారణాలు వెతకాలని సంకల్పించాడు. దేశమంతా తిరిగాడు. మనిషి దుఃఖం కారణాలు అపారమైన అతడి కోరికలేనని గ్రహించాడు. కోరికలు అజ్ఞాన హేతువులని అవి మనిషిలో శారీ రక సౌఖ్యం, ధన దాహం, కీర్తిపై మక్కువ పెంచుతున్నాయని, ఇది తీరనప్పుడు అతడి యుక్తాయుక్త విచక్షణకు అడ్డుపడతాయని తెలు సుకున్నాడు. సత్యాన్వేషకులకు ముందుగా తెలియవలసిన పరమ సత్యం అదేనన్నాడు.
ధరిత్రిని నిలిపి ఉంచుతున్న శక్తినంతటినీ బుద్ధుడు ధర్మ మన్నాడు. ధర్మమే దేవుడని, మనిషికి దారిచూపే వెలుగు ధర్మమొకటేనంటాడు. ధ్యానం వంటి సాధనలు ఆహాన్ని అదిగ మించేందుకు చాలునని, అవి సత్ఫలితాలనిచ్చినప్పుడు అతడికి కలిగేదే జ్ఞానోదయమన్నారు. జ్ఞానోదయం మనిషికి చరమలక్ష్యమైన మోక్షమని, అన్ని బంధాలకు అతీతుడు
చేసేది నిర్వాణమని, నిర్వాణమే మోక్షమని చెబుతారు. ఆనాత్మ్య ప్రాతిపదికగా బుద్ధుడి బోధనలున్నా కర్మలను, పునర్జన్మలను ఆయన నమ్మవచ్చన్నారు. సత్కర్మాచరణులతో దుష్కర్మలను బాపుకొని జన్మరాహిత్యం సాధించుకొమ్మంటారు.
బౌద్ధం మనిషి కర్మల మూలాలన్నీ అతడి చేతనే వెదికిస్తుంది. విధిని నమ్మను. చేసిన ప్రతి పనికీ కారణం, ఫలితాలుంటాయని అంగీకరిస్తుంది. త్రివిధ శరణాలైన బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛాములను ఆశ్రయించి ఆధ్యాత్మిక సత్యాల అన్వేషణ సాగిస్తే- కర్మ పరిపక్వానికి మనిషికి ఆ ప్రయత్నం చాలంటుంది. బుద్దుడు నిర్వచించి చెప్పిన నిర్వాణం, పరిశీలించి చూస్తే మనిషి సుఖదుఃఖాల సమన్వయంతో అతడు అనుభవించే మానసిక ప్రశాంతతగా, వేదాంతులనే స్థితప్రజ్ఞకు సమాంతరంగా కనిపిస్తుంది. తార్కిక వాదనలకన్నా ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడు పారమార్ధిక సత్యాలెన్నింటికీ సమాధానం అతడికి లభించగలదన్నది బుద్ధబోధ,
బుద్ధుడు హైందవ సనాతన ధర్మానికి మౌలికమైన ఆధ్యాత్మిక సూత్రాలతో విభేదించిన ప్రవక్త కాదు అవసరమనిపించినప్పుడు తనవైన విశ్లేషణలతో వివరణలనే ఇచ్చారు. హైందవులు ఆయన విష్ణువు అపరావతారమని ఆరాధించారు. భిన్నమైన ప్రవక్తగా భావించలేదు. ఆయన బోధనల్లోని ప్రముఖ అంశాలైన చతురాస్యసత్యాలు, అష్టాంగమార్గం, ధర్మచక్రం… అన్ని మతాల వారినీ ఆలోచింపజేశాయి. బౌద్ధం ఆహింసను పరమధర్మమంది. మనిషి చేసే అన్ని ధర్మ పోరాటాలకు అనువైన మార్గంగా విశ్వవ్యాప్తమైన గుర్తింపును తెచ్చి పెట్టింది.
బుద్ధుడు ప్రసాదించిన జ్ఞానమంతా మనుషులు, కోరికలు కలిగించే దుఃఖ స్వరూప స్వభావాలు అర్ధం చేసుకునేందుకు దుఃఖోపశమనమిచ్చే ఆధ్యాత్మికతను సాధించుకునేందుకు ఉన్నది. మనుషులంతా మనసువిప్పి ఒకరితో ఒకరు మృదువుగా మాట్లాడుకోవాలని, లేమితో బాధపడేవారికి సానుభూతి చూపిస్తే సరిపోదని సకాలంలో సహాయమందించాలని, తప్పుచేసిన వారిని ఔదార్యంతో క్షమించి చేరదీయాలని మనిషికి చెప్పేదెంతో బౌద్ధమంతా నిండి ఉంటుంది. బుద్ధుడి దర్మమార్గం యుగాలు గడిచినా చెక్కుచెదరక నిలిచే ఉంది.