*బదిలీల ఫైల్ ప్రస్తుతం గౌ౹౹ సీఎం గారి వద్దనే….ఇంకా ఆమోదం కాలేదు.*
నేడు జేడి సర్వీసెస్ పాఠశాల విద్య శ్రీ.మువ్వా రామలింగం గారు & స్టాఫ్ తో కలసిన సందర్భంగా తెలిసిన & అంచనా వేసుకున్న విషయాలు క్లుప్తంగా…
🔹 *రీ అప్పోర్షమెంట్:* (రేషనలైజేషన్) ఈ ప్రక్రియ 31.08.2022 కట్ ఆఫ్ డేట్ ప్రాతిపదికన పూర్తి అయ్యింది. ఐతే ఆయా జిల్లాల నుండి కలెక్టర్ల అనుమతి రావాల్సి ఉంది. ఒక కి.మీ పరిధి, ఆటంకాలు అన్నీ పరిగణలోకి తీసుకొన్నా 5300 పైగా ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు హై స్కూల్స్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. జి. వో లు 117,128 ఆధారంగానే ముందుకెళ్తున్నారు. 1 – 7 తరగతుల వరకు ఒకే మీడియం, ప్రాథమిక తరగతుల విలీనం, 36 గరిష్ట పీరియడ్స్ కేటాయింపు, మార్పు చేయని ఉపాధ్యాయ: విద్యార్థి నిష్పత్తి తదితర కారణాలతో భారీగా పోస్టులు సర్ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల్లో అవసరమైన చోట MTS (2008 & 1998 DSC) క్వాలిఫైడ్ వారిని వేసే అవకాశం ఉంది. ఇక నూతన DSC అనుమానమే.
*🔹పదోన్నతులు:* ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ అప్గ్రడేషన్ 4400 , Gr-2 HM’s పోస్టులు 998 ఆర్థిక శాఖ అనుమతి పొందడం తెలిసిందే. 697 మండలాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న యం ఈ ఓ 248 పోస్టుల భర్తీ మరియు రెండవ యం ఈ ఓ పోస్టులు 697, Dy EO 74 నూతన పోస్టుల పదోన్నతులకు సంబందించిన ఫైల్ ఆర్థిక శాఖలో వుంది.
#కర్నూలు జిల్లాకు కావలసిన దాదాపు 2800 పోస్టుల సర్దుబాటు పెండింగ్లో ఉన్నాయి.
🔹 *బదిలీలు*:
కేవలం బదిలీలు చేసే పరిస్థితి వుండదు.పై రెండు ప్రక్రియలు రేషనలైజేషన్, పదోన్నతులతో ముడిపడి ఉంటుంది. MEO పదోన్నతులు డైరెక్ట్ గా ఇవ్వడం మరియు మిగతా HM, All SA’s పదోన్నతులు మాత్రం పేపర్ మీద ఇవ్వడం జరుగును అనగా పదోన్నతి వస్తుంది కానీ ఇన్ సర్వీస్ వారి బదిలీల అనంతరం స్కూల్స్ కేటాయింపు జరుగును. బదిలీల ఫైల్ ప్రస్తుతం సీఎం గారి వద్ద ఉన్నది. కర్నూలు జిల్లా కు చెందిన పండిట్స్, పి ఈ టీ / పి.డి ల హైకోర్టు లో వున్న కేసు సోమవారానికి వాయిదా పడింది. (ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు).
ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నందున ఇప్పటికిప్పుడే అన్ని జరిగిపోతాయి అని ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఏదైనా షెడ్యూల్ వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి.
🔹 LFL HM ‘s – SA’s గా కన్వర్షన్ ఇచ్చిన వారి సీనియారిటి ఆ పదోన్నతి పొందిన తేదీ నుండి పరిగణించి జాబితాలో వుంచడం, స్టేషన్ & టోటల్ సర్వీస్ తీసుకొని బదిలీ చేయడం జరుగును.
*🔹మున్సిపల్ టీచర్ల సమస్యలు*:
APTF, సోదర సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు
జి.వో 40 ప్రకారం HM లు DDO లుగా మార్పు చేయుటకు పాలసీ మేటర్ కాబట్టి GAD లో ప్రాసెస్ లో వుంది. అదీ పూర్తి అయ్యే వరకు ప్రస్తుతం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు టీచర్లకు లోకల్ MEO, హై స్కూల్ టీచర్లకు DyEO ల డ్రాయింగ్ ఆఫీసర్స్ ద్వారా తాత్కాలికంగా జీతాలు మంజూరు చేయడం జరుగును.
🔹 GPF విషయంపై తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు
🔹 పదోన్నతులు, బదిలీలు ZP/ Govt టీచర్లవి కొలిక్కి వచ్చాక చేపడతామని అన్నారు.
.