*📚✍️తండ్రి పెన్షన్ వచ్చినా కారుణ్య నియామకానికి కొడుకు అర్హుడే✍️📚*
*♦️హైకోర్టు తీర్పు*
*🌻అమరావతి,ఆంధ్రప్రభ*: తండ్రి పెన్షన్ తీసుకుంటున్న ఓ తల్లిపై ఆధారపడి జీవిస్తున్న కుమారుడు కారుణ్య నియామకానికి అర్హుడే అని హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు చట్ట ప్రకారం విడాకులు తీసుకోకపోయినా కారుణ్య నియా మకానికి అర్హుడు కాదనటం సరికాదని తేల్చి చెప్పింది. కుమారుడు తల్లిపై ఆధార పడి జీవిస్తున్నందున కారుణ్య నియామకపు దరఖాస్తును తిరస్కరించరాదని పున రుద్ఘాటించింది. అధికారులు చేస్తున్న ఈ వాదన సరైందికాదని త్రోసిపుచ్చింది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామ జెడ్పీ హైస్కూలులో జి సరోజి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 2017లో మృతిచెందారు. ఆమె కుమా రుడు సునీల్ నిరుద్యోగిగా ఉన్నాడు. తల్లి మరణంతో తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ 2018లో కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారికి దర ఖాస్తు చేసుకున్నారు. అయితే దీన్ని జెడ్పీ సీఈఓ తిరస్కరిస్తూ 2020లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన 2021లో హైకోర్టును ఆశ్రయించారు. < జెడ్పీ తరుపున న్యాయవాది జీ శ్రీనివాసులురెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తల్లి, తండ్రి చట్ట ప్రకారం విడిపోలేదని తండ్రి పెన్షన్ పొందుతున్నారని కోర్టు దృష్టి కి తెచ్చారు. ఈ కారణంగా కారుణ్య నియామకపు దరఖాస్తును తిరస్కరించినట్లు చెప్పారు. పిటిషనర్ తరుపున న్యాయవాది ఎస్ సత్య నారాయణరావు జోక్యం చేసు కుంటూ హిందూ వివాహ చట్ట ప్రకారం ఆచారం ప్రకారం విడిపోవటమే చెల్లుబా టు అవుతుందన్నారు. కారుణ్య నియామకాన్ని తిరస్కరించటానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ స్పందిస్తూ ఈ కేసుల కారు ణ్య నియామకానికి కుమారుడు అర్హుడిగా పరిగణించాలని చెప్తూ అనర్హుడిగా ప్రక టిస్తూ కృష్ణాజిల్లా జెడ్పీ సీఈఓ జారీచేసిన ప్రొసీడింగ్స్ను రద్దు చేస్తూ తీర్పుని చ్చారు. తల్లిదండ్రులు చట్ట ప్రకారం విడిపోకపోవటాన్ని కారుణ్య నియామకాన్ని తిరస్కరించటానికి కారణంగా చూపటానికి వీల్లేదని స్పష్టంచేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇