ఇచ్చిపుచ్చుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. ఇవ్వడం ఆనందం, తీసు కోవడంలో ఎక్కువ ఆనందం. పుచ్చుకోవడంలో ఉన్న ఆనందానికి తృప్తి లేదు. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి సంతృప్తి ఉంటుంది.
మనం తినే ఆహారం, ఉండే ఇల్లు, ధరించే వస్త్రం, జీవితానికి ఉపయోగపడే విద్య వినియోగించే ప్రతి వస్తువు… ప్రకృతి నుంచి, ఇతరుల సహాయ సహకారా లతో పొందుతాం. ప్రకృతి ప్రతిఫలాపేక్ష రహితంగా సమస్త జీవరాశికి లేదన కుండా కన్నతల్లిలా అన్నీ సమకూరుస్తుంది. కాని, మనిషి దొరికినంత దోచుకోవ డమేగాని తిరిగి ఇవ్వడం బహు తక్కువ. ప్రతిదీ పరుల నుంచి గ్రహించి ఇతరు లకు ఏమీ పంచనివాడు అసలైన స్వార్ధపరుడు.
కేవలం కూడబెట్టడంలోనే నిమగ్నుడై సముద్రుడు పాతాళం వైపు ఉంటాడు. పుడిసెడు జలాన్ని వర్షించిన దాత మేఘుడు దర్జాగా గర్జిస్తూ ఆకాశాన విహరిస్తాడు.
శిబిచక్రవర్తి. కర్ణుడు, బలిచక్రవర్తి వంటి పురాణపురుషులు తమ వీరత్వంకంటే దాన గుణంతోనే చిరకీర్తిని ఆర్జించారు. దీనులకు సేవచేసి మదర్ థెరెసా, ఆకలిగొన్న వారికి అన్న దానం చేసి డొక్కా సీతమ్మ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి రామ శ్రీకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటివారు జీవితాన్ని చరితార్ధం చేసుకున్నారు.
నేటి కాలంలో ఎందరో మహానుభా వులు విద్య, వైద్యం, పర్యావ రణం, శరణాలయాలు, ఆధ్యా త్మిక ఉన్నతి కోసం దానధర్మాలు. చేసి లబ్ధ ప్రతిష్టులయ్యారు.
మనిషి జ్ఞానం, తెలివి, శక్తి యుక్తులు. మానవజాతికి ఉపయోగపడితేనే వాటికి చిలువ, ఒక మనిషికి భీముడి బలం, చాణక్యుడి మేధాసంపత్తి ఉన్నా ఏమీ సాధించక నిరుపయోగం కావచ్చు. ఇవ్వడమంటే ధనం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి దగ్గర అమూల్యమైన ధనేతర సంపద చాలానే ఉంటుంది.
స్నేహితుడికి నీ హృదయాన్ని, శత్రువుకు క్షమను, పెద్దలకు గౌరవాన్ని, యజ _మానికి విశ్వాసాన్ని, అర్ధాంగికి అనురాగాన్ని, పిల్లలకు వాత్సల్యాన్ని ఇయ్యి, వారికి చక్కటి ఆదర్శంగా నిలిచి, తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడేలా నడుచుకో. నీకు నువ్వు ఆత్మగౌరవాన్ని ఇచ్చుకో, సాటివారికి చేతనైన సహాయం చెయ్యి పెద్ద లకు గురువులకు ఏది ఇచ్చినా సమర్పణ భావంతో ఇయ్యి. ఇవన్నీ నీ దగ్గర తర గని సంపద. ఇచ్చేవాడిది ఎప్పుడూ పైచెయ్యే. పుచ్చుకొనే వాడిది కిందే! ఆ విష్ణు మూర్తి హస్తం కింద, తన హస్తం పైన ఉన్నప్పుడు ఆ బలి చక్రవర్తి: శ్రీ రాము డికి సీతను కన్యాదానం చేసిన జనకుడు. ఇంద్రుడికి కవచకుండలాలు దానం చేసిన కర్ణుడు… ఎంతటి తృప్తిని ఆనందాన్ని పొందారో కదా!!
ఇవ్వగలిగినంత మాత్రాన అహంకారంతో ఇవ్వకు, ఇచ్చే నీ గుణాన్ని బహిర్గతప రచిన ఆ వ్యక్తికి కృతజ్ఞతా భావంతో ఇవ్వు” అంటారు స్వామి వివేకానంద. సమా జంలో ప్రతి ఒక్కరూ ఇవ్వగలిగింది సంతోషంగా ఇస్తూ వినయంగా స్వీకరిస్తూ నడు చుకుంటే అంతా సుఖసంతోషాలతో సుహృత్ వాతావరణంలో జీవితం కొనసాగించ వచ్చు. అది కూడా చేయలేని స్థితిలో ఇతరులు నీకు ఏది చేస్తే ఆప్రియమో అది ఇతరులకు చేయకుండా ఉంటే చాలు. అదే పరమ ధర్మం