*🌻అమరావతి, ఆంధ్రప్రభ* : ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు 8వరగతి విద్యార్థులకు అందించేందుకు 5,18,740 ట్యాబులను మగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలోని వివాయంలో సోమవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా మాదేశంలో ట్యాబులతో పాటు అందులో పొందు పర్చాల్సిన కంటె ర్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గ్యారంటీతో కూడిన నాణ్యమైన ట్యాబులను అందించటలతో పాటు విద్యార్ధులకూ, టీచర్లకు అవసరమైన అన్ని ప్లికేషన్లు (యాప్) ఉండేలా చూడాలన్నారు. ప్రత్యేకించి ప్రతి టాబ్లో బైజూస్ కంటెంట్ ను తప్పనిసరి చేయాలని అధికారులను సీఏం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలను, ఇంటరాక్టివ్ టీ లను ఏర్పాటుచేయాలన్నారు. దీని కోసం 72,481 యూనిట్లు వసరం. సుమారు రూ 512 కోట్లు ఖర్చవుతుందని అధికారులు వరాలు అందించగా, దశలవారీగా అన్ని తరగతి గదుల్లో ఏర్పాటు యాలన్నారు. వచ్చేఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదు డిజిటలైజేషన్ పూర్తి కావాలి.. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపా యం ఉండేలా చూడాలి. డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాల యం, ఆర్బీకోలు, చిలేజ్ క్లినిక్స్ అన్నింట్లో కూడా ఇంటర్నె ట్ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
*♦️విద్యాకానుక పై కార్యాచరణ*
వచ్చే ఏడాది 2023 జూన్లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసుకో వాలని సీఎం ఆదేశించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యా కానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి జమ చేయాలి. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలి.. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలి. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శించాలి. నెలకోసారి ఏఎన్ఎం పరిశీలించాలన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఎవరెవరు ఎం చేయాలన్నదానిపై ఎస్ పీ తయారు చేశామని తెలిపారు.స్కూళ్ల నిర్వహణలో తను దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్లతో సహా అప్లోడ్ చేసే బాధ్యతలను ముగ్గురు సచివాలయ సిబ్బందికి అప్పగించనున్నట్టు తెలిపారు. మండలస్థాయిలో ఉండే విద్యాశాఖ: అధికారుల్లో (ఎంఈఓ) ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణా అంశాలు అప్పగించాలని ఈ సందర్భంగా సీఎం. సూచించారు. ఈ సందర్భంగా విద్యాకానుక ద్వారా విద్యార్ధులకు అందించే బ్యాగుల నాణ్యతను పరిశీలించారు. ఈసమీక్షాసమావేశం – లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
“మిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం నీ శేషగిరిజాయి, పాకశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.