*📚✍️పాఠశాల విద్యలో*
*ఇంటర్మీడియట్ విలీనం✍️📚*
*♦️ప్రక్రియ పూర్తికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు*
*🌻ఈనాడు, అమరావతి:* ఇంటర్మీడియట్ విద్యా శాఖను ప్రభుత్వం పాఠశాల విద్యలో విలీనం చేయనుంది. ప్రభుత్వ పాఠశాలలకు సీబీ ఎస్ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంటున్నందున భవిష్యత్తులో ఇంట ర్మీడియట్కు బదులు +2 విధానం అమల్లోకి వస్తుంది. అందుకోసమే ఈ విలీనం చేస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పాఠశాల, ఇంటర్మీడియట్ కమిషనర్లు, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, అకడమిక్, అకౌంట్స్ సంయుక్త కార్యదర్శి, సర్వీసెస్ సంయుక్త డైరెక్టర్, అంబేడ్కర్ వర్సిటీ ఉపకులపతి వెంకట్రావు, విశ్రాంత ఏడీ వీరభద్రారెడ్డితో కమిటీని ఏర్పాటు చేసింది. విలీనం ఎలా చేయాలనే దానిపై ఈ కమిటీ ప్రభు త్వానికి నివేదిక అందిస్తుంది. అయితే ఇందులో ఇంటర్మీడియట్ నుంచి కమిషనర్ను మాత్రమే నియమించడంపై లెక్చరర్ల సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. పాఠశాల విద్యకు చెందిన అధికారుల్ని నియ మించి, ఇంటర్మీడియట్ను విలీనం చేస్తే తమకు అన్యాయం జరుగు తుందని పేర్కొంటున్నాయి. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ 292 మహిళా జూనియర్ కళాశాలలను ప్రారంభించింది. వీటికి ఉన్నత పాఠ శాలల్లోని స్కూల్ అసిస్టెంట్లనే బోధనకు నియమించనుంది. ప్రిన్సిపల్ పోస్టుల్లో ప్రధానోపాధ్యాయులను నియమించాలా? ఇంటర్మీడియట్ విద్యలో సీనియర్లను తీసుకోవాలా? అనేదానిపై స్పష్టత లేదు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇