వైఎస్ఆర్ చేయూత పథకం 2022 పూర్తి వివరాలు
వైఎస్ఆర్ చేయూత పథకం 2022 కి సంబందించి సచివాలయం లో అప్లై చేయడానికి లింక్ ఆక్టివేట్ అయ్యింది – 45 సంవత్సారాల నుండి 60 సంవత్సారాలు లోపు వయసు గల మహిళలందరూ ఈ పథకానికి అర్హులే కావున అందరూ ఈ క్రింది డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ గమనించగలరు..
వై.యస్.ఆర్. చేయూత పథకం 2022
- 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు లోపు వయస్సు కలిగివున్న SC , ST , BC మైనారిటీ మహిళలు ఈ పథకానికి అర్హులు…!!!!
- Note : – 2022 ఆగస్టు 12 నాటికి 45 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
వైయస్సార్ చేయూత పథకానికి కావలసినటువంటి జిరాక్స్ కాపీలు
- ఆధార్ కార్డు జిరాక్స్
- ఆధార్ కార్డు హిస్టరీ
- భర్త లేదా కుటుంబ పెద్ద ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్డు జిరాక్స్
- కరెంటు బిల్లు
- ఇంటి పన్ను రసీదు
- ఇన్కమ్ సర్టిఫికెట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు లింక్ చేయబడిన మొబైలు నెంబర్
- ఆధార్ కార్డు లింక్ చేయబడిన బ్యాంకు అకౌంట్– దాని పాస్ బుక్ జిరాక్స్
- (అకౌంట్ నెంబరు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా కనపడాలి లేనియెడల జిరాక్స్ లో లబ్ధిదారుని చేత పెన్నుతో రాయించి తీసుకోండి)
- పథకం ద్వారా వచ్చే సొమ్మును ఏ వ్యాపార నిమిత్తం వాడుకుంటారు డెక్లరేషన్ రాయించుకోవాలి
- అప్లికేషన్ ఫామ్ – పైన చెప్పబడిన జిరాక్స్ కాపీలను వైఎస్సార్ చేయూత పథకం కావాలి అనే వారి దగ్గర్నుంచి వాలంటీర్లు సేకరించవలెను
ముఖ్య గమనిక : YSR చేయూత 2022-23 కి eligible అవ్వాలి అంటే August 12 1962 నుంచి August 12 1977 మధ్య లో జన్మించిన వారు అయి ఉండాలి ఆధార్ కార్డు లో కేవలం సంవత్సరం మాత్రమే ఉంటే 01/01/year గా పరిగణించాలి