Vidyarthi Vigyan Manthan Test 2022-23 – All the Details Here
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2022-23 – జాతీయస్థాయి ప్రతిభాన్వేషణ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన NCERT, CBSE, విజ్ఞాన్ ప్రసార్ (DST) మరియు విజ్ఞాన భారతి (స్వదేశీ శాస్త్ర సాంకేతిక ఉద్యమం) సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ పరికరాలతో నిర్వహించబడుచున్న అతిపెద్ద విజ్ఞాన శాస్త్ర పోటీ పరీక్షలు
అర్హత: 6 నుండి 11వ తరగతి వరకు తరగతుల వారీగా విజేతలకు బహుమతులు
పాఠశాల స్థాయి: మొదటి 3 ర్యాంకర్లకు: సర్టిఫికెట్
జిల్లా స్థాయి: మొదటి 3 ర్యాంకర్లకు: సర్టిఫికెట్
రాష్ట్ర స్థాయి: మొదటి 3 ర్యాంకర్లకు: సర్టిఫికెట్, మెమెంటో + నగదు బహుమతి
మొదటి బహుమతి రూ.5000, రెండవ బహుమతి రూ.3000, మూడవ బహుమతి రూ.2000.
జాతీయ స్థాయి: మొదటి 3 ర్యాంకర్లకు : సర్టిఫికెట్,మెమెంటో+నగదు బహుమతి
మొదటి బహుమతి రూ.25000, రెండవ బహుమతి రూ.15000, జాతీయ స్థాయి మూడవ బహుమతి రూ.10000.
జోనల్ స్థాయి పురస్కారములు కూడా రాష్ట్రస్థాయి బహుమతుల వలె ఇవ్వబడును.
భాస్కర స్కాలర్షిప్ – సృజన్ ఇంటర్న్షిప్ పోగ్రాం
పరీక్ష విధానం (ఆన్ లైన్): సెల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ మరియు డెస్క్టాప్
పరీక్ష మాధ్యమం: తెలుగు, హిందీ, ఇంగ్లీషు
రిజిస్ట్రేషన్ చివరి తేది & ఫీజు: 30 సెప్టెంబరు 2022 (ఫీజు రూ.200/-)
పరీక్ష తేది (ఆప్షన్): 27 నవంబరు 2022 (లేదా) 30 నవంబరు 2022 (ఒకరోజు మాత్రమే)
సమయం: 10.00 AM నుండి 06.00 PM మధ్యలో ఏదైనా 90 నిమిషాలు మాత్రమే (పరీక్షకు ఒకసారి మాత్రమే లాగిన్ కావలెను)
పరీక్ష ఫలితాలు: 20 డిశెంబరు 2022
రాష్ట్ర స్థాయి శిబిరం: 2023 జనవరి 8, 15 మరియు 22వ తేదీలలో ఏదైనా ఒకరోజు మాత్రమే
జాతీయ స్థాయి శిబిరం: 2023 మే 20 మరియు 21వ తేదీలు
రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరముల కొరకు: 9490801873/9396281908/6281206248
– భారతీయ విజ్ఞాన మండలి- విజ్ఞాన భారతి, ఆంధ్రప్రదేశ్ –