TS AGNIPATH : SURYAPET AGNIVEER RALLY 2022

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ద్వారా శిక్షణతో కలుపుకుని గరిష్ఠంగా 4 ఏళ్ల కాలపరిమితితో నియామకాలు చేపడతారు. ఆ తర్వాత కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే రెగ్యులర్ క్యాడర్‌గా తీసుకుంటారు.

Related Post

ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం నిర్దేశించిన అగ్నిపథ్‌ పథకం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబరు 3 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అగ్నిపథ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో అక్టోబరు 15 నుంచి 31 వరకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ అగ్రిపథ్ నియామక ర్యాలీ నిర్వహించనుంది. సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కాలేజీ మైదానంలో నియామక ర్యాలీ జరుగనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు నియామక ర్యాలీకి హాజరుకావచ్చు.

దీనిద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీలను భర్తీచేస్తారు. 8వ తరగతి, పదోతరగతి అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నిపథ్ నియామక ప్రక్రియ పూర్తి స్పష్టతతో, పారదర్శకంగా జరుగుతుంది. అభ్యర్థుల శ్రమ, సన్నద్ధత, ప్రతిభ ఆధారంగానే ఎంపికలు నిర్వహిస్తారని గుర్తుంచుకోవాలి. ఉద్యోగాలు కల్పిస్తాము, అర్హత సాధించేలా చేస్తామని చెప్పే మోసాగాళ్లు నుంచి జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఏజెంట్లు/ఏజెన్సీలను ఆశ్రయించ వద్దని సూచిస్తున్నారు.
ఆర్మీ యాక్ట్ 1950 సర్వీసు నిబంధనల ప్రకారం నాలుగేళ్ల ఉద్యోగ కాల పరిమితికి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థలు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. వాయు, నావిక, భూ సైన్యం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అగ్నివీర్‌లకు ఎలాంటి పెన్షన్ గానీ, గ్రాట్యుటీ గానీ అందదు. ఆర్మీ ర్యాంకులతో పోలిస్తే వీళ్ల ర్యాంకులు భిన్నంగా ఉంటాయి. అగ్నివీర్‌లు సైన్యం కోరిన చోట పనిచేయాలి. ఇందులో చేరేందుకు ఫిజికల్, రిటన్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్, మెడికల్ చెకప్ వంటివి పాసవ్వాలి. రిజిస్ట్రేషన్లు జూలై నుంచి ప్రారంభమవుతాయి.
అర్హత: అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీలకు 8వ తరగతి, ఇతర పోస్టులకు 10వ తరగతి అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.10.2022 నాటికి 17.5 – 21 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
నియామక తీరు:
ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ద్వారా శిక్షణతో కలుపుకుని గరిష్ఠంగా 4 ఏళ్ల కాలపరిమితితో నియామకాలు చేపడతారు. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సైనికులలో కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే రెగ్యులర్ క్యాడర్‌గా తీసుకుంటారు. వీరు 15 ఏళ్లపాటు సర్వీసులో ఉంటారు. మిగతా సైనికులు వాలెంటరీ రిటైర్‌మెంట్ పద్ధతిలో నిష్క్రమిస్తారు. నాలుగేళ్ల తర్వాత విరమణ పొందే సైనికులకు ‘సేవానిధి’ కింద రూ.12 లక్షల వరకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తారు.ఈ పథకం పరిధిలో ఎంపికైన వారికి పెన్షన్, గ్రాట్యుటీ ఉండవు. విరమణ పొందిన సైనికులకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అందజేస్తారు. అలాగే ఉద్యోగంలో ఉన్నంతవరకు రూ.48 లక్షల నాన్ కాంట్రిబ్యూటరీ జీవితబీమా కల్పిస్తారు. రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. అలాగే గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం:
నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన అగ్నివీరులకు మొదటి ఏడాది నెలజీతం రూ.30,000 (చేతికి రూ.21,000), రెండో ఏడాది రూ.33,000 (చేతికి రూ.23,100), మూడో ఏడాది రూ.36,500 (చేతికి రూ.25,580), నాలుగో ఏడాది రూ.40,000 (చేతికి రూ.28,000) ఇస్తారు. దీనితోపాటు కార్పస్ ఫండ్ కింద మొదటి ఏడాది రూ.18,000, రెండో ఏడాది రూ.19,800, మూడో ఏడాది రూ.21,900, నాలుగో ఏడాది రూ.24,000 ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2022.
* దరఖాస్తుకు చివరితేది: 03.09.2022.
* రిక్రూట్‌మెంట్ ర్యాలీ: అక్టోబరు 15 నుంచి 31 వరకు.
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 3

NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More

November 15, 2024

NMMS MODEL GRAND TEST – 2

NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More

November 14, 2024

NMMS MODEL GRAND TEST – 1

NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More

November 13, 2024

‘PAPER CUTTING’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 13, 2024