ఆర్.ఒ.సి. ఎ/361/డి.ఎం.డబ్లు.ఒ/2022, తేది: 1807.2022.
విషయము:మైనారిటీల సంక్షేమ శాఖ, చిత్తూరు జిల్లా –2022-23 విద్యా సంవత్సరమునకు కేంద్ర
ప్రభుత్వము వారు మైనారిటీ విద్యార్థుల కొరకు ప్రీ మెట్రిక్, బేగం హజ్రత్ మహల్ నేషనల్
స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కం మీన్స్ ఉపకార వేతనములకు
(స్కాలర్.షిప్పులకు) ధరఖాస్తు చేసుకొనుట – విషయమై.
సూచిక:మెమోనెం.1030/బి5/సియండబ్ల్యూ/202
/2022 తేది: 26.07.2022 డైరక్టరు, మైనారిటీల
సంక్షేమ శాఖ, ఆం.ప్ర, తడేపల్లి, గుంటూరు
పై సూచనలో డైరెక్టర్, మైనారిటీ సంక్షేమ శాఖ, ఆంద్రప్రదేశ్ వారు రాష్ట్రంలోని అన్ని
DMWOలు/DNOలను 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రీ మెట్రిక్, బేగం హజ్రత్, పోస్ట్ మెట్రిక్
మరియు మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ పథకాలను మైనారిటీ విద్యార్థులకు (ముస్లింలు, క్రైస్తవులు, జైనులు,
సిక్కులు, బౌద్ధులు మరియు పార్సీలు) మరియు విద్యా సంస్థలులకు ప్రముఖ స్థానిక వార్తాపత్రికలు మరియు
ఇతర తగిన ప్రచార మాధ్యమాలలో ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలని అభ్యర్థించారు..
22-23 సంవత్సరానికి సంబంధించిన కాలపరిమితి :
పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకుని చిత్తూరు జిల్లాలోని మండల విద్యా అధికారులకు మరియు
ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్లుకు (ప్రధానోపాద్యాయులు/ప్రిన్సిపల్స్) విద్యార్థుల రిజిస్ట్రేషన్లను నిర్దేశించిన
సమయంలోపు పూర్తిచేయమని ఆదేశించవలసినదిగా తమరిని అభ్యర్థన చేయుచున్నాము మరియు సంబంధిత
మార్గదర్శకాలను జతపరచడమైనది.
జిల్లా మైనారటల సంక్షేమ శాఖ, చిత్తూరు
పత్రికా ప్రకటన
2022-23 విద్యా సంవత్సరమునకు భారత ప్రభుత్వము మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ప్రీ మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ మరియు మెరిట్ కం మీన్స్ ఉపకార వేతనముల కొరకు విధ్యార్థులు scholarships.gov.in (NSP) అనే వెబ్ సైట్ ద్వారామైనార్టీల (ఆల్ప సంఖ్యాక వర్గాల విద్యార్థులు (ముస్లిలు, క్రిస్టియన్లు, జైన్లు, బుద్ధిష్ణు, సిక్కులు మరియు పార్పీలు) ధరఖాస్తుచేసుకోవాలని తెలిపియున్నారు.
1) ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం:
1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న మైనారిటీ కమ్యూనిటీ విద్యార్థులు అర్హులు, తల్లిదండ్రుల సంవత్సర
ఆదాయము రూ.1.00 లక్షల మించకూడదు, 1 నుండి 5వ తరగతి వరకు రూ.1,000/- మరియు 5 నుండి 10 వ
తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 5,000/- ఇవ్వబదడును.
2) బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ పథకం:
9 నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న మైనారిటీ కమ్యూనిటీ విద్యార్థినిలు (బాలికలు) మాత్రమే
అర్హులు, తల్లిదండ్రుల సంవత్సర ఆదాయము రూ.2.00 లక్షల మించకూడదు, 9 నుండి 10వ తరగతి వరకు రూ.
5,000/- మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రూ.6,000/- ఇవ్వబదడును
3) పోస్టు మెట్రిక్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం:
ఇంటర్ నుండి పోస్టు గ్రాజ్యువేట్ వరకు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు అర్హులు, తల్లిదండ్రుల సంవత్సర
ఆదాయము రూ. 2.00 లక్షల మించకూడదు, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రూ.7,000/- ఇవ్వబడును
సాంకేతిక మరియు వృత్తి విద్యా కోర్సుల చదువుతున్న విద్యార్థులకు రూ.10,000/- వరకు ఇవ్వబడును గ్రాడ్యుయేట్
మరియు పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు రూ. 13,000/- వరకు ఇవ్వబడును.
4) మెరిట్ కం మీంన్స్ స్కాలర్షిప్ పథకం:
సాంకేతిక మరియు వృత్తిపరమైన కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు అర్హులు, తల్లిదండ్రుల సంవత్సర
ఆదాయము రూ. 2.50 లక్షల మించకూడదు, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సాంకేతిక
మరియు వృత్తిపరమైన కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.20,000/- ఇవ్వబడును
5)పై మూడు పథకములకు క్రితం సంవత్సరము నందు కనీసము 50% మార్కులు పొంది ఉండవలెను
6) విద్యార్థులు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవడానికి ఫొటో, ఆధార్, ఆధార్ తో లింక్ చేయబడిన విద్యార్థి యొక్క బ్యాంకు
పాను పుస్తకము, ఆదాయ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, మునుపటి సంవత్సరం యొక్క మార్కుల
జాబిత మరియు పాఠశాల/కళాశాల వారి బోనఫైడ్(స్టడి) సర్టిఫికేట్లను తప్పనిసరిగా అప్లోడ్ చేసి, శాశ్వత చిరునామా
అనగా ఆధార్లో ఉన్న చిరునామాతో మాత్రమే ధరఖాస్తు చేసుకోవలెను.
7) స్కాలర్షిప్ నిధులు ఆధార్తో లింక్ చేయబడిన విద్యార్థి బ్యాంక్ ఖాతాకు మాత్రమే జమ చేయబడుతుంది ( జాయిట్
అకౌంట్లో దరఖాస్తు చేసుకోకూడదు).
8) ఆదాయ ధృవీకరణ పత్రములో ఉన్న ఆదాయాన్ని మరియు మునుపటి సంవత్సరం యొక్క మార్కుల జాబితాలో ఉన్న
మార్కుల శాతము (%) మాత్రమే నమోదు చేసి ధరఖాస్తు చేసుకోవలెను.
9) ఒక కుటుంబం నుండి ఇద్దరు కంటే ఎక్కువ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వబడదు.
10) విద్యార్థి స్కాలర్షిప్ యొక్క పై నిబంధనలు మరియు షరతులను ఉల్లంఘిస్తే, స్కాలర్షిప్ నిలిపివేయబడవచ్చు లేదా
రద్దు చేయబడవచ్చు.
11) మైనారిటీల కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్లలో ఒక విద్యార్థి ఒక స్కాలర్షిప్కు మాత్రమే అర్హులు
ప్రీ మెట్రిక్ మరియు బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ విద్యర్థుల ధరఖాస్తు చివరి తేది: 30.09.2022, పోస్ట్ మెట్రిక్
మరియు మెరిట్ కం మీన్స్ విద్యార్థుల ధరఖాస్తు చివరి తేది: 31.10.2022 ఇతరవివరముల కొరకు scholarships.gov.in
అనే వెబ్సైట్ నందు గాని లేదా ఫోన్ నెం.7382781316ను సంప్రదించగలరు.