*🌻మచిలీపట్నం*: విద్యాశాఖలో ప్రమోషన్ల కోలాహలం మొదలైంది. ఉపాధ్యాయులకు అర్హత మేరకు ఉద్యోగోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధ మవుతోంది. క్యాడర్ వారీగా ఉపాధ్యాయుల సీని యా జాబితాలను బుధవారం జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. వీటిపై అభ్యంతరాలుంటే తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకునేం దుకు రెండు రోజులు గడువు ఇచ్చారు. ఆ తరువాత ఫైనల్ జాబితాలను ప్రకటించి, ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ముందుగా ఉద్యో గోన్నతులు, ఆ తరువాత బదిలీలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేయాలని కమిషనరేట్ నుంచి అం న సంకేతాలతో జిల్లా విద్యాశాఖాధికారులు జాబితాల తయారీలో నిమగ్నమయ్యారు..
*♦️పారదర్శకంగా ప్రమోషన్లు ….*
-ఉపాధ్యాయులకు సర్వీసు పరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా టీచర్ర్ ఇన్ఫర్మేషన్ సిస్ట మ్(టీఐఎస్)ను అమల్లోకి తీసుకొచ్చారు. ఉపాధ్యా యులకు సంబంధించిన సమస్త వివరాలను టీఐ ఎస్ అనే వెబ్సైట్లో నమోదు చేశారు. దీని ఆధా రంగానే సీనియార్టీ జాబితాలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు విద్యాశాఖాధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రదోన్నతులు, బదిలీలు అంతా గందరగోళంగా ఉం శ్రీదేవి. సంఘాల ఆధిపత్యం. ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫార్సులకు తలొగ్గే పరిస్థితులు ఉండే వి. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇటువంటి వాటికి చెక్ పెట్టేలా అంతా ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది. పదోన్నతులు, బదిలీలు ఇలా ఏవైనా అర్హతే కొలమానంగా, ఇంటి వద్ద నుంచే ఉత్తర్వులు అందుకునేలా ఉపాధ్యాయులకు చక్కటి అవకాశం కల్పించింది..
*♦️343 మందికి అవకాశం..*
జిల్లా పునర్విభజన జరిగినప్పటికీ, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాతిపదికనే ఉద్యోగోన్నతులను కల్పించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జాబితాలను సిద్ధం చేశాడు. ఉమ్మడి కృష్ణాలో వివిధ క్యాడర్లలో పనిచే స్తున్న 343 మంది ఉద్యోగోన్నతికి ఆర్తులుగా గుర్తిం చి, జిల్లా విద్యాశాఖాధికారులు జాబితాలు ప్రకటిం చారు ఒకే సారి ఇలా వందలాది మందికి ప్రమోషన్లు రానుండటంతో ఉపాధ్యాయుల్లో హర్షా తిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఖాళీలు ఎక్కడు న్నాయనేది అప్పడే ఆరా తీస్తుండటంతో విద్యా శాఖలో ప్రస్తుతం ఇదే కోలాహలం కనిపిస్తోంది.
*♦️ప్రభుత్వ మేనేజ్ మెంట్ స్కూళ్లలో..*
స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, సోషల్, ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ డైరక్టర్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఉర్దూ పోస్టులు ఒక్కోటి చొప్పున, తెలుగు సబ్జెక్టులో రెం డు పోస్టులు ఖాళీగా ఉండగా, ఈ మేరకు వీటి ఉద్యోగోన్నతులు కల్పించేయకు అర్హులైన ఉపా ధ్యాయుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు.