- ఏపీ మోడల్ స్కూళ్లలో టీచర్ జాబ్స్
- 282 పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీ
- ఆగస్టు 17 దరఖాస్తులకు చివరితేది
AP Model School Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూల్స్‌లో (Model Schools) 282 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తాజాగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల భర్తీతో మోడల్ స్కూళ్లలో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది.
మొత్తం 282 పోస్టుల్లో 211 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) పోస్టులున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, అనుభవం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మెరిట్ అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే మోడల్ స్కూళ్లలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లకు పోస్టుల భర్తీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) – 71
- అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
- జీతాలు: నెలకు రూ.28,940 ఉంటుంది.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) – 211
- అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
- జీతం: నెలకు రూ.31,460 ఉంటుంది.
ఎంపిక విధానం:
- ఈ పోస్టులకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కులు, బీఈడీ మెథడాలజీలో సాదించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు17, 2022
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cse.ap.gov.in/
2009లో మోడల్ స్కూళ్లు ఏర్పాటు:
కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా 2009లో మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 355 స్కూళ్లు ఏర్పాటు కాగా విభజన అనంతరం ఏపీకి 164 స్కూళ్లు కేటాయించారు. వీటిల్లో మొత్తం 91,520 సీట్లు అందుబాటులో ఉండగా 65,600 సెకండరీ ఎడ్యుకేషన్, 25,920 ఇంటర్ విద్యకు సంబంధించినవి ఉన్నాయి.
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులతో ఇంటర్ బోధన కొనసాగుతోంది. ప్రారంభంలో ఈ స్కూళ్లలో చేరికలు తక్కువగా ఉండగా ఇప్పుడు సీట్లకు డిమాండ్ పెరిగింది. డీఎస్సీ ద్వారా ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులు కొంతమేర భర్తీ అయ్యాయి. ఇంకా 565 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వీటిలో 282 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
- జోన్ – 1 = 50 పోస్టులు (పీజీటీ – 33, టీజీటీ – 17)
- జోన్ – 2 = 04 పోస్టులు (పీజీటీ – 04, టీజీటీ – 00)
- జోన్ – 3 = 73 పోస్టులు (పీజీటీ – 50, టీజీటీ – 23)
- జోన్ – 4 = 155 పోస్టులు (పీజీటీ – 124, టీజీటీ – 31)