పాలిసెట్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
పాలిసెట్-2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్కు సంబంధించి దరఖాస్తు గడువును ఆగస్ట్ 11వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలాభాస్కర్ మంగళవారం తెలిపారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణ, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్ట్ 11 వరకు గడు వును పొడిగిస్తున్నట్లు వివరించారు. బుధవారం టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీ క్షల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ విద్యార్థులకు మేలు కలిగేలా పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరా లకు “పాలేసెట్ వెబ్సైట్’ను సందర్శించాలని కోరారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 6 నుంచి 11 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్ట 12 వరకు ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంది. సీట్లను 16న కేటాయించి 22 నుంచి తరగతులను ప్రారంభిస్తారు.
CLICK Here To download full Details