AP PGCET 2022: AP PGCET Exams from September 3.. Hall Tickets from 25th of this month

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP PGCET 2022: సెప్టెంబర్‌ 3 నుంచి ఏపీ పీజీసెట్‌ పరీక్షలు.. ఈనెల 25 నుంచి హాల్‌టికెట్లు

AP PGCET 2022: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏపీ పీజీ సెట్ 2022 ఎంట్రన్స్ నోటిఫికేషన్ ను ఏపీ ఉన్నత విద్యా మండలి (APSCHE) విడుదల చేసింది. ఈసారి కడప యోగి వేమన యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తుందని వెల్లడించింది. సెప్టెంబర్ 3, 4, 7 ,10, 11 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు.. రెండో సెషన్‌ మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు.. మూడో సెషన్‌లో సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు

రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగ‌స్టు 18తో ముగిసిందన్నారు. 147 సబ్జెక్టులకు 39,359 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. ఎక్కువగా కెమికల్‌ సైన్సెస్‌కి 9,899 మంది.. లైఫ్‌ సైన్స్‌కు 5,960 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. సెప్టెంబరు 3, 4, 7, 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుందన్నారు.

ఈ నెల 25 నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. సంస్కృతం, ఉర్దూ, తమిళం, బీఎఫ్‌ఏ, పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ అండ్‌ మ్యూజిక్‌, ఆర్ట్స్‌, టూరిజం, జియోగ్రఫీ సబ్జెక్టులకు దరఖాస్తులు తక్కువగా వచ్చినందున పరీక్ష నిర్వహించడం లేదన్నారు. డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా ఆ కోర్సులకు సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

error: Content is protected !!