AP PECET- 2022: Conduct of Physical Efficiency and Games skill Test
ఏపీ పీసెట్ అభ్యర్థులకు 17 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి వ్యాయామ విద్య దేహదారుఢ్య పరీక్షలు (ఏపీ పీసెట్ 20 22) ప్రారంభమవుతాయని ఏపీ పీ సెట్ కన్వీనర్ డాక్టర్ పి. జాన్సన్ మంగళవారం తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 1850 మంది దరఖా స్తు చేశారని, వీరిలో 1325 మంది బాలురు కాగా, 535 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. బాలురకు ఈనెల 17 నుంచి 19 వరకు, బాలికలకు ఈనెల 20న పరీక్షలు జరుగుతాయని వివరించారు. బాలురకు 100 మీటర్లు, 800 మీటర్లు, షాట్ ఫుట్ . లాంగ్ జంప్, హై జంప్ తోపాటు ఏదైనా ఎంపిక చేసుకున్న ఆట యందు ప్రావీ ణ్యం పరీక్షలు, బాలికలకు 100 మీటర్లు, 400 మీటర్లు షార్ట్ పుట్, లాంగ్ జంప్, హైజంప్ తో పాటు ఎంపిక చేసుకున్న ఆట యందు ప్రావీణ్యము పరీక్ష నిర్వహిస్తా మని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల పదో తేదీ నుంచి హాల్ టికెట్లను సి ఈ టి డాట్ ఏపీ ఎస్సిహెచ్ఎస్ఈ డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్/పీ సెట్ అంతర్జాలం ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం > లోని క్రీడా ప్రాంగణం నందు ఈనెల 17వ తేదీ ఉదయం 6 గంటలకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమ వుతాయని జాన్సన్ పేర్కొన్నారు.