AP LIMITED DSC NOTIFICATION 2022 WITH 502 TEACHER POSTS
502 టీచర్ పోస్టుల భర్తీ : పాఠశాల విద్య కమిషనర్ సురేష్
రాష్ట్రంలో 502 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్ల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లిమిటేడ్ రిక్రూట్‌మెంట్-2022 విడుదల చేస్తామన్నారు. పాఠశాల విద్యాశాఖలో వివిధ క్యాటగిరిలో ఉపాధ్యాయుల నియామకం కోసం మొత్తం 502 పోస్టులు ప్రకటించిన్నట్లు తెలిపారు. పాఠశాల విద్యలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జిటి, మ్యూజిక్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు, ఎపి మోడల్ స్కూల్స్, బిసి వెల్ఫేర్ స్కూళ్లల్లో పిజిటి, టిజిటి, ఆర్ట్ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని వివరించారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు cse.ap.gov.in లో ఈ నెల 23వ తేది నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు.