ADMISSIONS:ICAR AIEEA 2022 APPLY ONLINE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

యూజీ, పీజీ, పీహెచ్‌డీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌(ఐకార్‌) ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌(ఏఐఈఈఏ) 2022-23 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

    ఈ పరీక్ష ద్వారా 75 అగ్రికల్చర్‌ యూనివర్సిటీలు ఇందులో 64 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చరల్‌, ఫిషరీస్‌ యూనివర్సిటీలు, 4 ఐసీఏఆర్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు, 3 సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు, 4 సెంట్రల్ యూనివర్సిటీల్లోని వ్యవసాయ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు…

ఐకార్‌- ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌(ఏఐఈఈఏ)- 2022-23 ద్వారా బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ) కోర్సుల్లో ప్రవేశాలు

అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్‌/ 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మిగిలిన కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 31.08.2022 నాటికి అభ్యర్థుల కనీస వయసు యూజీకి 16 ఏళ్లు, పీజీకి 19, పీహెచ్‌డీకి 20 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. యూజీ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 178 నగరాలు, మిగిలినవాటికి 89 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

పరీక్ష వ్యవధి: 150 నిమిషాలు(యూజీ), 120 నిమిషాలు(పీజీ, పీహెచ్‌డీ).

దరఖాస్తు ఫీజు: 

బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రాం: రూ.800(ఓబీసీలు రూ.770, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జెండర్లు రూ.400 చెల్లించాలి)

మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాం: రూ.1150(ఓబీసీలు రూ.1120, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జెండర్లు రూ.570 చెల్లించాలి)

పీహెచ్‌డీ ప్రోగ్రాం: రూ.1850(ఓబీసీలు రూ.1820, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జెండర్లు రూ.920 చెల్లించాలి)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 20.07.2022 నుంచి 19.08.2022 వరకు.

దరఖాస్తులో మార్పులు చేసుకునే తేదీలు: 21.08.2022 నుంచి 23.08.2022 వరకు.

UG LINKS

NOTIFICATION FOR UG

UG EXAM SCHEDULE

APPLY FOR UG

PG LINKS

NOTIFICATION FOR PG

PG EXAM SCHEDULE

APPLY FOR PG

Ph.d LINKS

NOTIFICATION FOR Ph.D

Ph.D EXAM SCHEDULE

APPLY FOR Ph.D

PUBLIC NOTICE

WEBSITE

error: Content is protected !!