Additional Quantum of Pension పై పూర్తి వివరాలు ప్రశ్నలు, జవాబుల రూపంలో సంక్షిప్తంగా
Additional Quantum of Pension పై పూర్తి వివరాలు ప్రశ్నలు, జవాబుల రూపంలో సంక్షిప్తంగా
*Additional Quantum of Pension మన రాష్ట్ర పెన్షనర్లకు ఎప్పటి నుండి అమలైయింది?*
9th Pay Commission రిపోర్టు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు GOMS No 100 Finance (Pension-1) Dept. dt.6/4/2010 లో పెన్షనర్లు , ఫేమలీ పెన్షనర్లకు వయస్సు ఆధారంగా 75 సంవత్సరాల వయస్సు పై బడినవారికి మొదటి సారి అడిషనల్ క్వాటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసిరి.
*Additional Quantum of Pension ఎందుకు ఇవ్వాలి?*
రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ పే ప్రతీ సంవత్సరం వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుతో పెరుగుతూ ఉంటుంది.కానీ పెన్షనర్స్ బేసిక్ పెన్షన్ మార్పు PRCలలో మాత్రమే మారుతుంది. దీనివల్ల సీనియర్ పెన్షనర్లకన్నా వెనుక రిటైర్ అయిన జూనియర్ పెన్షనర్లు ఎక్కువ పెన్షన్ పొందడం జరుగుతుంది. పైగా వయస్సురీత్యా పెద్దవారగుతున్న పెన్షనర్లు , ఫేమలీ పెన్షనర్లు వైద్యంపై ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్ధితి ఉంటుంది. ఈ అంతరం కొంతమేర తగ్గించడానికి Additional Quantum of Pension మంజూరుచేయాలని GOMS No 100 Finance (Pension-1) Dept. dt.6/4/2010 లో పేర్కొన్నారు.
*9th PRC లోAdditional Quantum of Pension ఏఏ వయస్సుల వారికి ఎంత శాతం నిర్ధేశించారు?*
Additional Quantum of Pension 75 సంవత్సరాల వయస్సు పైబడిన పెన్షనర్లు , ఫేమలీ పెన్షనర్లుకు వారి వయస్సున బట్టి బేసిక్ పెన్షన్ పై ఎంతశాతం పెంచి ఇవ్వాలో పై జివో లు ఈ క్రింది విధంగాఇవ్వడం జరిగింది.
75 to 80 Age Group కు 15%
80 to 85 Age Group కు 20%
85 to 90 Age Group కు 25%
90 to 95 Age Group కు 30%
95 to 100 Age Group కు 35%
100 Above 50% మంజూరు చేస్తారు.
*Additional Quantum of Pension 10 వ పి ఆర్ సిలో కోనసాగిందా?*
Additional Quantum of Pension 2015PRC లో కూడా 2010 PRC లో 100 GO ద్వారా ఇవ్వబడిన Age Group % కొనసాగిస్తూ AP ప్రభుత్వం GO MS No 66 Finance HRM VI Pension dt 12/6/2015 ఉత్తర్వులు జారీ చేసి యున్నారు.
కానీ 6/5/2017 న AP Pensioners Association అమరావతి , AP JAC వారు చేసిన రిప్రజంటేషన్ అనుసరించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఏజ్ గ్రూప్ సవరణ చేస్తూ GO MS No 6 Dt.12/1/2019 జారీ చేసిరి .దీనిననుసరించి ఈ క్రింది చూపిన విధంగా పెన్షనర్ / ఫేమలీ పెన్షనర్ కు % Additional Quantum of Pension మంజూరు చేయబడుతుంది.
70 to 75 Age Groupకు 10%
75 to 80 Age Group కు 15%
80 to 85 Age Group కు 20%
85 to 90 Age Group కు 25%
90 to 95 Age Group కు 30%
95 to 100 Age Group కు 35%
100 Above 50% .
*Additional Quantum of Pension 11వ PRC లో ఏవిధంగా మంజూరయింది? ఏం అన్యాయం జరిగింది?*
మన రాష్ట్ర ప్రభుత్వం 11వ పేకమీషనర్ Additional Quantum of pension పై ఏమి రికమెండ్ చేసారో బయట పెట్టకుండా సి యస్ కమిటి రిపోర్టు ననుసరించి ఇప్పటికి అమలులో ఉన్న విధానంకాదని- కేంద్రప్రభుత్వ విధానం అంటూ వయోవృద్ధులకు అన్యాయం చేస్తూ 80 సంవత్సరాలు పైబడినవారికి మాత్రమే AQP వర్తింపచేస్తూ జీవో నెం.2 తేదీ 17.01.2022 జారీచేసింది.
*ప్రభుత్వం Additional Quantum of Pension ఎలా ఉంటుందని ఈ జివోలో ప్రకటించింది??*
జీవో నెం.2 ప్రకారం అడిషనల్ క్వాటమ్ ఆఫ్ పెన్షన్ 70-75 సంవత్సరాల వారికి పూర్తిగా తొలగించ బడింది.
మిగిలిన వయస్సులవారికి ఈ క్రిందివిధంగా పేర్కొన్నారు.
80 సం౹౹లు నిండిన వారికి 20%,
85 నిండిన వారికి 30%,
90 నిండిన వారికి 40%,
95 నిండిన వారికి 50%,
100 నిండిన వారికి 100%
*తరువాత ఏం జరిగింది?*
70-75 సంవత్సరాల వారికి పూర్తిగా తొలగించడంను వ్యతిరేకిస్తూ ‘పునరుద్దరించాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయులతో కలసి ఉద్యమించి చలో విజయవాడ విజయవంతం చేయడంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పై సర్వీస్ పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు ఈ క్రింది విధంగా మార్పు చేస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 30 డి టెడ్ 20/2/ 22 ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. రివైజ్డ్ పే స్కేల్స్2022 సంబంధించి 17 -1- 2020 ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 2 పేరా 6 కు సవరణగా ఈ ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి.
*జీవో ఎంఎస్ నెంబర్ 30 dt 20/2/ 22 ఉత్తర్వులలో AQP ఎలానిర్ధారించారు??*
ఈ ఉత్తర్వులు అనుసరించి జివో 2లో తొలగించబడ్డ 70-79 సంవత్సరాలు మధ్య వయస్సున్న పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్దరించ బడింది. ఆర్థిక లాభం 1/4 /2020 నుండి ఇవ్వబడుతుంది.
*జీవో ఎంఎస్ నెంబర్ 30లో ఏఏ యస్సులకు ఎంతశాతం AQP ఇవ్వబడింది?*
ఈ జీవో ననుసరించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈ క్రింది విధంగా మంజూరు చేయబడుతుంది
70 సంవత్సరాలు నిండిన వారికి 7%
75 సంవత్సరాలు నిండిన వారికి 12%
80 సంవత్సరాలు నిండిన వారికి 20%
85 సంవత్సరాలు నిండిన వారికి 25%
90 సంవత్సరాలు నిండిన వారికి 30%
95 సంవత్సరాలు నిండిన వారికి 35%
100 సంవత్సరాలు నిండిన వారికి 50% మంజూరు కాబడుతుంది.
*AQP పై ప్రభుత్వం ఇచ్చిన జివో 30 వల్ల పూర్తి న్యాయం జరిగిందా??*
జివో 2లో 70, 75 సంవత్సరాల వారికితొలగించిన AQP మాత్రమే GO 30లో పునరుద్ధరిస్తూ సవరణ చేస్తే మేలు జరిగి ఉండేది .కానీ ప్రభుత్వం కోతకోయాలనే ధ్యేయంతో 85నుండి 100 సంవత్సరాలవారికి జివో 2లో ఇచ్చినదానిలో సగానికి కోతవేసి ఈఉత్తర్వులలో పొందుపరచడం వల్ల సీనియర్లకు తీవ్ర అన్యాయం జరిగింది.
*GO 30 ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న AQP వివరాలు ఏమిటి?*
ప్రస్తుతం G O 30 ప్రకారం AP లో 70 సంవత్సరాలు నిండిన వారికి 7%
75 సంవత్సరాలు నిండిన వారికి 12%
80 సంవత్సరాలు నిండిన వారికి 20%
85 సంవత్సరాలు నిండిన వారికి 25%
90 సంవత్సరాలు నిండిన వారికి 30%
95 సంవత్సరాలు నిండిన వారికి 35%
100 సంవత్సరాలు నిండిన వారికి 50% మంజూరు కాబడుతుంది.
*పైన తెల్పిన ప్రకారం 70నిండిన వారికి 7% , 75నిండిన తరువాత మరో 12% మంజూరు చేస్తారా?*
ఇక్కడ ఒక అంశం గమనించాలి
75 to 80 Age Group కు 12% అంటే 70 to 75 లోపు 7% +
75To 80 – 5% = 10% అంతేగానీ 7+12=19% అని కాదు
అలానే మిగిలిన అన్నిటికీ పరిగణించాలి.
*70 సంవత్సరాలకే AQP అంటే 69నిండి 70 రాగానే AQP మంజూరు చేస్తారా?*
ఈ జివో ప్రకారం 70సంత్సరాలు అంటే 70 పూర్తయి71లో అడుగిడునపుడు మాత్రమే AQP మంజూరు చేస్తారు.
*పుట్టిన తేది నెలమధ్యలోనో నెలాఖరునో ఉన్నప్పడుAQP ఏతేదినుండి మంజూరవుతుంది?*
పుట్టిన తేది నెలమధ్యలోనో నెలాఖరునో ఉన్నప్పటికి ఆనెల 1వతేదీనుండే AQP మంజూరు చేస్తారు.
ఉదా xఅనె వ్యక్తికి ఏప్రియల్ 30 పుట్టిన తేది అయితే ఆయనకు 70నిండిన ఏప్రియల్ 30నుండి కాక ఏప్రియల్ 1నుండే మంజూరు చేస్తారు.
*ప్యామలీ పెన్షనర్స్ AQP కోసం తమ పుట్టిన తేదీ PPO లో నమోదుకాక ఇబ్బంది పడుతున్నారు, వారికి ఎలా మంజూరు చేయవచ్చు?*
FP తమపుట్టిన తేదీ PPO లో నమోదుకాక వారదగ్గర ఏవిధమైన జననదృవీకరణ లేక AQP పొందుటలేకపోతున్న మాట వాస్తం. అట్టి వారు ఏవిద్యార్హత లేక పుట్టినతేదీ దృవపత్రం లేనట్టివారు ఆధార్ కార్డు ,పాన్ కార్డు తో సంబంధిత STO గారికి దరఖాస్తు చేసి పొందవచ్చు లేదా గవర్నమెంట్ సివిల్ సర్జన్ ఆపై స్ధాయి డాక్టర్ దృవీకరించిన వయస్సు దృవపత్రం సమర్పించి AQP పొందే అవకాశం ఉంది.
*UGC స్కేల్స్ పొందుతున్న పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు AQP ఒకేవిధంగా ఇవ్వబడుతుందా?*
UGC స్కేల్స్ పొందుతున్న పెన్షనర్లకు GO NO 14Dt 1/3/2022 ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం 70 సంవత్సరాలనుండి కాక Go No 1 dt 17/1/22 లో పొందు పరచిన విధంగా 80సంవత్సరాల వయస్సు పూర్తయిన తరువాత 20% , 85-30%, 90- 40% , 95-50% 100 &Above 100% గా పేర్కోనడం జరిగింది.
ఇది అన్యాయం.రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 70నిండాకా అడిషనల్ క్వాంటమ్ ఇవ్వబడుతుండగా అదే రాష్ట్రంలోని UGC స్కేల్స్ వారికి 80 నిండినప్పటినుండే ఇస్తున్నారు.
*UGC స్కేల్స్ వారికి ఇవ్వబడుతున్న AQP శాతం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇస్తున్న AQP శాతం ఒకటేనా?*
కాదు.
UGC వారికి
80-20% ,
85-30%,
90- 40% ,
95-50%
100 &Above 100%.
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు
70 – 7%,
75 – 12%
80 – 20%
85 – 25%
90 – 30%
95 – 35%
100 – 50%
*Additional Quantum of Pension బేసిక్ పెన్షన్లో మెర్జి చేస్తారా?*
చేయరు. సెపరేట్ గా చూపుతారు.
*Additional Quantum of Pension పై డి ఆర్ వస్తుందా?*
అవును.డి ఆ.ర్ ఇవ్వబడుతుంది కానీ సెపరేట్ గా చూపకుండా రెగ్యులర్ డి ఆర్ లో కలిపి చూపుతారు.
*Additional Quantum of Pension పై ఐ ఆర్ మంజూరవుతుందా?*
Additional Quantum of Pension పై ఐ ఆర్ ఇవ్వబడదు.
*PRC వల్ల మన పే మారి తదుపరి దీనికి అర్హత పొందితే రివైజ్డ్ పే పై మంజూరు చేయబడుతుందా?*
అవును. రివైజ్డ్ పే పై మంజూరు చేయబడుతుంది.
అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70,75,80,85 ఇలా సంవత్సరాలు పూర్తయిన తరువాత కాక ఆయా సంవత్సరానికి అడుగిడిన వెంటనే మంజూరు చేయాలని,హైకోర్టు ఒక పెన్షనర్ కు ఇచ్చిన తీర్పు మేరకు అది అందరికీ వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పెన్సనర్స్ సంఘాలు కోరాయి.
You might also check these ralated posts.....