స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది పాఠశాలలకు ఉత్తమ పాఠశాలల అవార్డును ప్రదానం చేయనున్నారు. పదోతరగతిలో వందశాతం ఫలితాలు, విద్యార్థుల సరాసరి మార్కులు అత్యధికంగా ఉన్న బడులను ఈ అవార్డులకు ఎంపికచేశారు. ప్రతి యాజమాన్యం నుంచి ఒక్కో పాఠశాలను ఎంపిక చేశారు. ఉత్తమ పాఠశాలలకు సీఎం జగన్ జ్ఞాపికలు అందజేయనున్నారు.