260 మందికి ఎంఈవోలుగా బాధ్యతలు మరియు నూతన ఎంఈవో ల జాబితా
హెచ్‌ఎంలకు ఎంఈవో
బాధ్యతలు
అమరావతి, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ప్రధానో పాధ్యాయుల(హెచ్‌ఎం)కు అదనంగా మండల విద్యాధికారి(ఎంఈవో) బాధ్యతలు అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఈవో పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎంఈవోలు ఒక్కొక్కరు మూడు, 4 మండలాల బాధ్యతలు చూస్తున్నారు. దీంతో వీలైనంత మేర హెచ్‌ఎంలతో ఖాళీ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయాలని భావించింది.
260 మందికి
ఎంఈవోలుగా బాధ్యతలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 260 మండల విద్యా ధికారుల పోస్టుల్లో ఇన్ఛార్జులను నియమిస్తూ విద్యాశాఖ ఆర్జేడీ ఆదేశాలు జారీ చేశారు. 679 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 419 మంది పని చేస్తున్నారు. మిగతా ఖాళీ పోస్టుల్లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఇన్ ఛార్జులుగా నియమించారు. డిప్యూటీ డీఈవో పోస్టులు 56 ఉండగా, వీటిల్లో సగం పదోన్నతులు, మిగతావి నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. నేరుగా నియమించే వరకూ అన్ని పోస్టుల్లోనూ ఇన్ఛార్జు లను నియమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని హెచ్ఎం లతోనే ఎంఈవో పోస్టులన్నింటినీ భర్తీ చేయడాన్ని ఏపీ టీఎఫ్, యూటీఎఫ్ అభ్యంతరం తెలిపాయి.
LIST OF NEW MEO’S
👇👇👇👇👇👇👇👇
You might also check these ralated posts.....