*♦️రాష్ట్ర అభ్యర్థులకు పొరుగు రాష్ట్రాల్లో కేంద్రాల ఏర్పాటు*
*🌻అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి*): టీచర్ అర్హత పరీక్ష(టెట్)లు ముగిశాయి. ఈ నెల 6న ప్రారంభమైన ఈ పరీక్షలు ఆదివారంతో పూర్తయ్యాయి. 2018 తర్వాత మళ్లీ ఈ ఏడాదే టెట్ నిర్వహించడంతో ఈసారి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయితే, రాష్ట్రంతో పాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఈ కేంద్రాలు పెట్టారు. ప్రతిసారీ ఆయా రాష్ర్టాల సరిహద్దుల్లో ఉండే అభ్యర్థుల సౌకర్యార్థం వీటిని ఏర్పాటు చేస్తారు. కానీ, ఈసారి వేలాది మంది విద్యార్థులు రాష్ట్రం దాటి బయటకు వెళ్తేగానీ పరీక్షలు రాయలేని స్థితి ఏర్పడింది. రాష్ట్రంలోనే అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరినా పాఠశాల విద్యాశాఖ స్పందించలేదు. ఫలితంగా పక్క రాష్ర్టాలకు వెళ్లలేక వేల మంది అభ్యర్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. అందులోనూ చాలా మంది అభ్యర్థులు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవడంతో రెండు సార్లు అంత దూరం వెళ్లలేక మానేశారు. అయితే, ఆర్థిక భారం, ఇబ్బంది ఉన్నా కొందరు మాత్రం హాజరయ్యారు. అభ్యర్థుల అభిప్రాయాల మేరకు, టెట్ రాయని వారు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారని అంచనా
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇