🌷🌷
నూతన అన్లైన్ పెన్షన్ విధానముపై ఆడిట్ డైరెక్టర్ హరి ప్రకాష్ గారు సమావేశం ఏర్పాటు చేశారు
>మిత్రులారా! ఇప్పటివరకు పెన్షన్ ప్రపోజల్స్ వెరిఫై అనేది ఎ.జి కార్యాలయం ద్వారా జరుగుతుంది.
>అయితే కర్నూలు మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్స్,నాల్గవతరగతి ఉద్యోగులకు మాత్రము 40సంllలకు పైగా రాష్ట్ర ఆడిట్ కార్యాలయం నుండి పెన్షన్ వెరిఫై జరుగుతుంది.ఇది ఇప్పటి వరకు జరుగుతున్న పద్దతి.
> ఇదిలా ఉండగా పెన్షన్ ఆథెంటికేషన్ ఆన్లైన్ చేయాలని డైరెక్టర్ గారు ప్రతిపాదించారు.
> ఇప్పటి వరకు జరుగుతున్న విధానంలో పెన్షన్ ప్రపోజల్స్ పెట్టడం చాలా భారంగా ఉందని,కావున అన్లైన్ విధానం ద్వారా సరళీకృతం చేయాలని పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.
> కేవలం నాలుగు పేజీలతో పెన్షన్ ప్రపోజల్స్ పూర్తి చేసే విధంగా ఫార్మాట్ లు రూపొందించారు
> పెన్షన్ సాఫ్ట్‌వేర్ కు ఈ- ఎస్సార్ నుండి సమాచారం తీసుకొనే అవకాశం ఉందని తెలియజేశారు.
ప్రతిపాదనలు:-*
> పెన్షన్ ప్రపోజల్స్ ఏ.జి కార్యాలయంనకు పంపాలంటే విజయవాడకు పంపాలని,కాని రాష్ట్ర ఆడిట్ కు అప్పగిస్తే అన్నీ జిల్లాలో ఆడిట్ కార్యాలయాలు ఉన్నందున పెన్షన్ ప్రపోజల్స్ పంపడానికి సులభతరమవుతుందని తెలియజేశాము.అయితే ఏ.జి డిపార్ట్మెంట్ వారితో పోల్చుకుంటే రాష్ట్ర ఆడిట్ (లోకల్ ఫండ్ ఆడిట్) డిపార్ట్మెంట్ లో అవినీతి ఎక్కువగా ఉన్నదని దానిని కంట్రోల్ చేయకుండా రాష్ట్ర ఆడిట్ డిపార్ట్మెంట్ టేకోవర్ చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని ఫెడరేషన్ పక్షాన తెలియజేశాము.
> విధానమేదైనా ఉద్యోగ విరమణ అయ్యేరోజుకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల ఖాతాలలో జమ అయ్యేవిధంగా ఒక పాలసీని రూపకల్పన చేయాలని చెప్పాము
> రాష్ట్ర ఆడిట్ డిపార్ట్మెంట్ ద్వారా నే అన్నీ జిల్లాలకు అన్నీ క్యాడర్లకు పెన్షన్ వెరిపై చేసి ఖజానా కార్యాలయాలకు పంపాలని తెలియజేశాము.
> సాప్ట్ వేర్ ను కూడా సరళంగా రూపకల్పన చేయాలని,అటాచ్మెంట్స్ తగ్గించాలని సూచించాము
> ప్రస్తుతం రిటైర్మెంట్ లు లేవు కనుక రివైజ్డ్ పెన్షన్లు ఆన్ లైన్ చేసి కొంత అలవాటు చేయాలని సూచించడమైనది.
> పెన్షన్ ప్రపోజల్స్ పెట్టిన తరువాత జిల్లా ఆడిట్ నుండి వెరిఫై చేయబడి ట్రెజరీలకు పంపడానికి నిర్ణీత గడువును విధించి ఆగడువులోగా డిస్పాచ్ అయ్యేట్టు విధివిధానాలను రూపకల్పన చేయాలని సూచన చేయడమైనది.