TG JOB CALENDAR FOR 2024-25

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TG Job Calendar 2024-25 released వివరాలు వెల్లడించిన ఉపముఖ్యమంత్రి భట్టి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపర్చారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంంబ్లీలో ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో నిర్వహించనున్నారు.

  • సెప్టెంబర్లో వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల.. నవంబర్లో పరీక్షలు.
  •  ట్రాన్స్కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు
  • నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు
  • వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్లో పరీక్షలు
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్లో పరీక్షలు
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్.. మేలో పరీక్షలు
  •  గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు.
  • ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు.
  • డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టరు. లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో నోటిఫికేషన్.. సెప్టెంబర్లో పరీక్షలు
  • వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు 2 నోటిఫికేషన్.. అక్టోబర్లో పరీక్షలు
  • వచ్చే ఏడాది జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్ నవంబర్లో పరీక్షలు
  •  సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్.. నవంబర్లో పరీక్షలు

Download Job Calendar 2024

error: Content is protected !!