NMMS SELECTED CANDIDATES REGISTER ON NSP PORTAL BEFORE 31.01.2024

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

NMMS SELECTED CANDIDATES REGISTER ON NSP PORTAL BEFORE 31.01.2024

ప్రభుత్వ పరీక్షల కార్యాలయం
పత్రికా ప్రకటన


ఫిబ్రవరి 2023 లో జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్ధులు
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు తమ వివరములు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ 31-01-2024
తదుపరి ఎటువంటి పొడిగింపు ఉండదు అని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేయడమైనది. విద్యార్ధి వివరములు అనగా విద్యార్ధి పేరు, పుట్టిన తేదీ మరియు విద్యార్ధి తండ్రి పేరు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ పైన ఉండవలెను. విద్యార్థి వివరములు ఆధార్ వివరములతో
సరిపోలనప్పుడు “For your submitted information there is no scheme available” అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది లేదా “PM Yashasvi…” స్కీమ్ చూపిస్తుంది. విద్యార్థులు ఈ విషయమును గమనించి వెంటనే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమును సంప్రదించి “Aadhaar Mismatch వివరములను 27-01-2024 లోపు సమర్పించవలెను”. విద్యార్ధి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ను సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో ది.15-02-2024 లోపు క్షుణ్ణం గా పరిశీలించి, స్కూల్ నోడల్ ఆఫీసర్ లాగిన్ (INO) ద్వారా
ధృవీకరించవలెను. INO లాగిన్ ద్వారా వివరములు దృవీకరించే సమయం లో విద్యార్ధి వివరములు ఏమయినా
తప్పులు ఉన్నట్టు గ్రహిస్తే “DEFECT” చేసి మరలా విద్యార్ధి లాగిన్ నుండి వివరములను సరిచేసి మరలా INO
లాగిన్ ద్వారా ధృవీకరించవలెను. అదేవిధంగా నవంబరు 2019, ఫిబ్రవరి 2021 మరియు మార్చి 2022.
సంవత్సరములలో ఎంపిక కాబడి ప్రభుత్వ మరియు అయిడెడ్ పాఠశాలల్లో/కళాశాలల్లో చదువుచున్న విద్యార్ధులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. గత సంవత్సరాలలో బ్యాంక్ పాస్ బుక్ ద్వారా నమోదు చేసుకున్న రెన్యువల్ విద్యార్థులకు ఆధార్ వివరములను నమోదు చేసే సమయంలో Aadhaar Mismatch ఉన్నట్లు అయితే వెంటనే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమును సంప్రదించి “Aadhaar Mismatch” వివరములను 27-01-2024 లోపు సమర్పించవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు
కాబడదు. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్ధులకు స్కాలర్షిప్ మంజూరు కాబడదు, దానికి విద్యార్థి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాలవారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు
తెలియజేసారు.
ధృవీకరించడమైనది
ఉప కమిషనర్

తేదీ:24-01-2024
సం/- డి. దేవానంద రెడ్డి
సంచాలకులు
ప్రభుత్వ పరీక్షల కార్యాలయం

DOWNLOAD PRESS NOTE

CLICK HERE TO REGISTER ONLINE ON NSP PORTAL

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!