పీఎమ్ శ్రీ పథకం కింద దేశవ్యాప్తంగా 9000 పాఠశాలలు ఎంపిక ఆంధ్రప్రదేశ్ నుంచి 662 పాఠశాలలు

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

పీఎమ్ శ్రీ పథకం కింద దేశవ్యాప్తంగా 9000 పాఠశాలలు ఎంపిక ఆంధ్రప్రదేశ్ నుంచి 662 పాఠశాలలు

* ఏపీ నుంచి 662 బడులు

* కేంద్ర విద్యాశాఖ ప్రకటన

 

ఈనాడు, అమరావతి: దేశ వ్యాప్తంగా పీఎంశ్రీ పథకం కింద 9 వేల పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల నుంచి 2.5 లక్షల పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా.. వీటిలో నుంచి 9 వేలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక కరిక్యులమ్‌తో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వీటికి అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రయోగశాలలు, క్రీడా సామగ్రి, సిలబస్‌కు అనుగుణంగా  డిజిటల్‌ తరగతి గదులు, ఆర్ట్‌ స్టూడియోలను ఏర్పాటు చేస్తుంది. పోటీ ప్రపంచానికి తగినట్లు విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఏపీ నుంచి 662 పాఠశాలలు ఎంపికయ్యాయి.

error: Content is protected !!