AP TEACHERS TRANSFERS 2022 APPLY ONLINE LAST DATE IS 17 DEC 2022
AP TEACHERS TRANSFERS 2022 APPLY ONLINE LAST DATE IS 17 DEC 2022
*బదిలీల ఆన్లైన్ దరఖాస్తు గడువు 14-12-2022 నుండి 17-12-2022 వరకు*
జిల్లా విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియచేయడమేమనగా …
💠 బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునే విషయంలో ఒకసారి అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్పులు చేసుకొనుటకు అవకాశం లేదు.
💠 సబ్మిట్ ఆప్షన్ నమోదు చేయకముందు ఎన్నిసార్లు అయినా మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.
💠 ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చేసుకొనుటకు అవకాశం ఉండదు.
💠 ఉపాధ్యాయులు ఎవరైనా ట్రాన్స్ఫర్ అప్లికేషన్లో సమాచారం తప్పుగా నమోదు చేసి ఉంటే దానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును.
💠 జిల్లాలలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ పరిధిలోని ఉపాధ్యాయులకు స్పష్టంగా తెలియజేయాల్సిందిగా సూచించడమైనది.
💠 దరఖాస్తు నమోదు చేసుకోవడానికి నిర్దేశించిన గడువు: *14-12-2022 నుండి 17-12-2022 వరకు*
💠 రీ అప్పోర్షన్ ప్రక్రియలో సర్ప్లస్ గా గుర్తించబడిన ఉపాధ్యాయులు, 5/8 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ పండిట్స్ తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి.
💠 స్పౌజ్/ ప్రిఫరెన్షియల్ కేటగిరిల కింద దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఏదైనా ధ్రువీకరణ పత్రాలు తప్పుగా నమోదు చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడును.
*…..రాష్ట్ర విద్యా శాఖ …*
You might also check these ralated posts.....