ఈ రోజు (19.10.2022) సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో రిగ్ననైజ్డ్ సంఘాలు మరియు మున్సిపల్ టీచర్ల సంఘాల సమావేశం జరిగింది. చర్చల ముఖ్యాంశాలు….

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*ఈ రోజు (19.10.2022) సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో రిగ్ననైజ్డ్ సంఘాలు మరియు మున్సిపల్ టీచర్ల సంఘాల సమావేశం జరిగింది. చర్చల ముఖ్యాంశాలు….*

*1.* బదిలీల జీవో సిద్ధం అయ్యింది. 2020లో జరిగిన బదిలీల ప్రాతిపదికనే ఇప్పటి బదిలీలు కూడా జరుగుతాయి. బదిలీలకు గరిష్ఠ పరిమితి 8 సంవత్సరాలుగా నిర్ధారించారు. కనీస సర్వీస్ “0” లేదా “2” సంవత్సరాలా అనేది రేపు ఫైనల్ చేస్తారు. ఆ తర్వాతనే బదిలీల జిఓ విడుదల అవుతుంది.
*2.* (1) పాఠశాలల విలీనం వల్ల మరియు 117 జిఓ ఆధారంగా రేషనలైజేషన్ కు గురైన వారికి, (2) 2020 బదిలీలలో మున్సిపల్ ప్రాంతాలలో పనిచేస్తూ బదిలీ అయిన వారికి కోర్టు ఉత్తర్వులు ప్రకారం మరియు (3) 2017, 2021 సంవత్సరాలలో బదిలీ అయి ఇప్పటికీ రిలీవ్ కాకుండా రేషనలైజేషన్ కు గురి అయినవారికి గతంలో పనిచేసిన పాఠశాల స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి అంగీకరించారు. 8 సంవత్సరాల సర్వీస్ ఒకేచోట చేసిన వారికి మత్రం స్టేషన్ పాయింట్లు ఇవ్వరు.

*3.* పిఇటి, పిడి బదిలీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. పిఇటిలు పనిచేస్తున్న పిడి పోస్టులను ఖాళీలుగా చూపాలని ప్రాతినిధ్యం చేసాం.

*4.* పనిచేసే పాఠశాల ఆధారంగా సర్వీస్ పాయింట్లు లెక్కించాలని, వైద్య కారణాల మీద ఉద్యోగి లేదా అతని కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులకు గురి అయినపుడు ఫ్రిపరెన్స్ ఇవ్వాలని, Widows కు ఫ్రిఫరెన్స్ కొనసాగించాలని, ఏజెన్సీ నుండి ప్లెయిన్ కు, ప్లెయిన్ నుండి ఏజెన్సీకు బదిలీలు కోరుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రాతినిధ్యం చేసాం.
 పరిశీలిస్తామని అన్నారు.

*5.* మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు డిడిఓ పవర్స్ జిఓ 1,2 రోజుల్లో విడుదల అవుతుంది. త్వరలో సర్వీస్ రూల్స్ రూపొందించి పండిట్, పిఇటి, ఎస్.జి.టి. పోస్టులను అప్ గ్రేడ్ చేస్తారు. హెడ్మాష్టర్ ప్రమోషన్లు వెంటనే ఇస్తారు. రేషనలైజేషన్ జరిపి పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరమైన మేరకు పోస్టులు కొత్తగా మంజూరు చేస్తారు. పిఎఫ్ సమస్య పరిష్కారమయ్యేవరకు కమీషనర్ల వద్ద నున్న ఖాతాలను కొనసాగిస్తారు. డిసెంబర్ 31నాటికి సమస్యలన్నిటిని పరిష్కరించి ప్రమోషన్లు, బదిలీలు అమలు చేస్తారు. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ కు ఆదేశాలు ఇచ్చారు.

*6.* ఇటీవల జరిగిన ప్రమోషన్లలో 4700మందికి  ప్రమోషన్స్ ఇచ్చారు. వీరితో బాటు 2776మందికి సబ్జెక్ట్ కన్వర్షన్ ఇచ్చారు. ఉత్తర్వులు 1,2 రోజుల్లో ఇస్తారు. కన్వర్షన్ పొందిన వారు వెనకకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని అడిగాము. అయితే అవకాశం లేదని చెప్పారు.

*7.* హైకోర్టు తీర్పు ప్రకారం ఇటీవల మినిమమ్ టైం స్కేల్ లో నియమితులైన 1987మందితో బాటు మిగిలిన 2008 డిఎస్.సి. సెలెక్ట్ డ్ అభ్యర్దులను  రెగ్యులర్ ఖాళీలలో నియామించాలని ప్రాతినిధ్యం చేసాం. బదిలీలు ముగిసిన వెంటనే వారిని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా నియమిస్తామని తెలియజేసారు. అలాగే 1998 DSC Qualified టీచర్లకు Online లో Submit చేయడానికి మరొక అవకాశం ఇచ్చారు. Online లో సబ్మిట్ చేయలేని వారు మాన్యువల్ గా ఇచ్చినా తీసుకుంటారు.  క్వాలిఫై అయిన వారందరికీ బదిలీల అనంతరం మినిమమ్ టైం స్కేల్ లో నియమిస్తూ ఉత్తర్వులు ఇస్తారు.

*8.* కర్నూలు జిల్లాలో SA తెలుగు వారి కోర్టు కేసు రెండుమూడు రోజుల్లో పరిష్కారం అవుతుందని తెలియజేసారు. తీర్పు వచ్చిన వెంటనే తెలుగు, హిందీ subjectలలో ప్రమోషన్లతో బాటు బదిలీలు కూడా నిర్వహిస్తారు.

*9.* ఎయిడెడ్ వారికీ 62 years Retirement GO జనవరి 2022 వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రాతినిధ్యం చేసాం. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 30Years Scale ఇవ్వడానికి GO&EO పాస్అవకుండానే, 24 స్కేల్ కు ఇచ్చిన అర్హతలతో 30 స్కేలు ఇవ్వాలని ప్రాతినిధ్యం చేసాం.

*10.* ట్రైబల్ వెల్ఫేర్ లో ఖాళీగా ఉన్న DEO, DYEO పోస్ట్స్ సీనియారిటీ ప్రకారం ట్రైబల్ డిపార్ట్మెంట్ వారితో భర్తీ చేయాలని, ఆ ప్రాంతంలో గల మండల విద్యాశాఖాధికారి 2 పోస్టులలో ఒకదానిని వారితో భర్తీ చేయాలని కోరాము.

*11.* విజయనగరం ప్రమోషన్ల సీనియార్టీ జాబితాలో చోటుచేసుకున్న అసంబద్దాలపై ఫీర్యాదు చేసాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

*12.* కొత్తగా మంజూరు చేసిన 679 ఎంఇఓ పోస్టులపై కొందరు కోర్టుకు వెళ్లినవారు ఈ నెల 20వ తేదీలోగా కేసు ఉపసంహరించుకోకపోతే మొత్తం 679 ఎంఇఓ పోస్టులను రద్దు చేయాలని విద్యాశాఖ ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

*యుటియఫ్ రాష్ట్ర కమిటీ*

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!