మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్‌ పూర్తి:సిఎం ఆదేశం

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*📚✍️మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్‌ పూర్తి✍️📚*
 *♦️సిఎం ఆదేశం*
*♦️టీచర్లు, విద్యార్థులకు 5,18,740 ట్యాబ్‌లు*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :* ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతి గదుల డిజిటలైజేషన్‌ జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో ఇంటర్నేట్‌ సదుపాయం ఉండేలా చేయాలన్నారు. పాఠశాల విద్యపై తన క్యాంపు కార్యాలయంలో సిఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. డిజిటలీకరణకు 72,481 యూనిట్లు అవసరమని, సుమారు రూ.512 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేశామని అధికారులు సిఎంకు వివరించారు. డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్‌బికెలు, విలేజ్‌ క్లినిక్స్‌ అనిుట్లోనూ ఇంటరొట్‌ సదుపాయం కల్పించాలని సిఎం ఆదేశించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు 5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ ఉంటుందని పేర్కొన్నారు. నాడు-నేడు పనులను పూర్తిచేసుకున్న పాఠశాలలను నెలకోసారి ఆడిట్‌ చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేవా? అన్నది పరిశీలించి, అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌లో పాఠశాలలు తెరిచే నాటికి విద్యాకానుక కచ్చితంగా అందాలని చెప్పారు. యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలని ఆదేశించారు.
నిర్వహణ సమస్యలపై 14417 టోల్‌ ఫ్రీ నెంబరు
పాఠశాలల నిర్వహణ సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలనిసిఎం అధికారులతో చెప్పగా, 14417 టోల్‌ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశామనిఅధికారులు వెల్లడించారు. పాఠశాలల నిర్వహణ నిధులను వాడుకునినిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలనిఅధికారులను సిఎం ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలనిచెప్పారు. పాఠశాలల అభివృద్ధి, నిర్వహణలపై తరచూ వారితో సమావేశాలు నిర్వహించాలనిఆదేశించారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని పునరుద్ఘాటించారు. వీటిపై ఎప్పటికప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలనిఆదేశించారు. వీటిని అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలనితెలిపారు. పారిశుధ్య లోపం, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలా వరకునివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. మండలస్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారులు (ఎంఇఒ) ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి పాఠశాలల నిర్వహణ అంశాలు అప్పగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌, పాఠశాలల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనరు కాటమనేని భాస్కర్‌, ఇంటర్‌ విద్య కమిషనరు ఎంవి శేషగిరి బాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళి తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

error: Content is protected !!