AP CM YS Jagan Holds Review Meeting on EDUCATION Depts ON 12/09/2022, HIGHLIGHTS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP CM YS Jagan Holds Review Meeting on EDUCATION Depts ON 12/09/2022, HIGHLIGHTS 

విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..

 పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన  క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్‌ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆడిట్‌  నిర్వహించారు. వాటికి సంబంధించిన వివరాలను సీఎంకు అందించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాల్లో ఎదురైన సమస్యలను గుర్తించామని, వాటికి సంబంధించి వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..:
♦నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలని సీఎం ఆదేశం.
♦ప్రతి నెలకు ఒకసారి ఆడిట్‌ చేయాలన్న సీఎం
♦స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలి
♦అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలి
♦స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలి
♦ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక నంబర్‌ను స్కూళ్లలో ప్రదర్శించాలి
♦ఈ నంబర్‌కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలన్న  సీఎం
♦14417 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామన్న అధికారులు

విద్యా కానుకపైనా సీఎం సమీక్ష..
♦వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్నిరకాల వస్తువులూ అందించేలా కార్యాచరణ సిద్ధంచేసుకున్నామన్న అధికారులు
♦స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలన్న సీఎం
♦యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలన్న సీఎం
♦స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలని సీఎం ఆదేశం
♦స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలన్న సీఎం
♦గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని మరోసారి పునరుద్ఘాటించిన సీఎం
♦వీటిపై ఎప్పకప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలన్న సీఎం
♦నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
♦దీంతో పారిశుద్ధ్య లోపం వల్ల, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలావరకు నివారించడానికి అవకాశం ఏర్పడుతుందన్న సీఎం

♦సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు స్కూళ్ల నిర్వహణలో భాగస్వామ్యం కానున్న సచివాలయ ఉద్యోగులు
♦ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్‌ మరియు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శన
♦నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శన
♦ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ఎస్‌ఓపీ తయారు చేశామన్న అధికారులు
♦స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్‌లతో సహా అప్‌లోడ్‌ చేయనున్న ముగ్గురు సచివాలయ సిబ్బంది
♦వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోనున్న అధికారులు
♦మండలస్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈఓ) ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణా అంశాలు అప్పగించాలన్న సీఎం

టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సమీక్షించిన సీఎం..
♦5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం.
♦ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌
♦తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
♦ఈ కార్యక్రమంపైనా  సమీక్ష చేసిన ముఖ్యమంత్రి
♦దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనావేసిన అధికారులు
♦దశలవారీగా వీటిని తరగతిగదుల్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
♦దాదాపు రూ. 512 కోట్లుపైగా ఖర్చు అవుతుందని అంచనా
♦వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్‌ జరగేలా చూడాలన్న సీఎం
♦అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశాలు
♦డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!