AP SSC 10TH CLASS RESUTS 2024

సమావేశం లో కీలక నిర్ణయాలు - SIKKOLUTEACHERS.COM

సమావేశం లో కీలక నిర్ణయాలు

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
సమావేశం లో కీలక నిర్ణయాలు పలు సంఘాలు నుంచి వస్తున్న సమా చారం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఇద్దరు MEO లు –
 1.ప్రస్తుత ఖాళీలు 248 Govt.Teachers కు కొత్తగా వచ్చే 672 పోస్టులు ZP Teachers కు కేటాయిస్తారు.
2.Transfers లో 5సం.లు గరిష్ట సర్వీస్ తో అప్రూవ్ అయింది.కానీ మనం 8 సం.లు అడిగాం.
3.ఫేషియల్ ఆప్ తో జీతాలు, ట్రెజరీ link up లేదు.
4.టెక్నికల్ సమస్యలతో ఫేషియల్ ఆప్ క్యాప్చర్ కాకపోతే ఉపాధ్యాయులకు సంబంధం లేదు.
5. అందరూ రేపటి నుంచి ఫేషియల్ ఆప్ హాజరు వేయాలి.
6.పదోన్నతులు సమస్య Govt./ZP ది పరిష్కారానికి C.M గారు సుముఖంగా ఉన్నారు 
7.ఫేషియల్ ఆప్ DEVISE ప్రభుత్వం ఇవ్వదు.
8.ఫేషియల్ ఆప్ Time taking,blink,turn,be in the frame,one person,image not matched, straight head ఇవన్నీ త్వరలో పరిష్కరిస్తారు.
9.తిరిగి 15 రోజుల తర్వాత సమీక్ష సమావేశం ఉంటుంది.
మిత్రులారా! ఈరోజు ఫేషియల్ యాప్ మరియు ఉమ్మడి సర్వీసు రూల్స్ నిబంధనలపై మంత్రిగారు చర్చ ప్రారంభించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలు డిప్యూటీవోలు ఇవ్వడాన్ని మేము ఉపాధ్యాయ సంఘాలుగా వ్యతిరేకిస్తున్నామని, ఏ విధంగా అంటే 26 జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ అనేది అన్నీ క్యాడర్లకు జరగాల్సిన తరుణంలో మీరు ప్రభుత్వ పాఠశాలల హెచ్.ఎం లకు ఇవ్వడం  371- డి అధికరణానికి వ్యతిరేకమని ఆవిధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలియజేయడం జరిగింది. అయితే ప్రభుత్వం వారు మేము ఇచ్చేటువంటి నియామకాలు కేవలం 248 మాత్రమేనని తాత్కాలికమైనవని ,పంచాయితీ రాజ్ ఉపాధ్యాయులకు 672 ఎంఈఓ పోస్టులు ఇవ్వనున్నామని,ఉమ్మడి సర్వీస్ రూల్స్ పరిష్కారం అయిన తరువాత కామన్ సీనియారిటీ తీసుకొంటామని విద్యాశాఖామంత్రి తెలియజేశారు.
>యాప్ ల విషయమై డివైజ్ లు ఇవ్వాలని    సంఘాలు పట్టుపట్టగా ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి మరో పదిహేను రోజులు సమయం తీసుకొని సహకరించండని మంత్రిగారు తెలియజేశారు.
>అయినా మనం డివైజ్ లు ఇస్తే సజావుగా జరుగుతుందని మన అభిప్రాయాన్ని తెలియజేశాము.
>ఆఫ్ లైన్ లో పనిచేసే విధంగా యాప్ ను అప్ డేట్ చేశామని,శాలరీకి అనుసంధానం చేయమని,మంత్రి గారు తెలియజేశారు.యాప్ లపై మనకున్న అభ్యంతరాన్ని తెలియజేసి,ఉమ్మడి సర్వీసు రూల్స్ పై ఫెడరేషన్ తయారు చేసిన డాక్యుమెంట్ ను మంత్రిగారికి,కమీషనర్ గారికి ఇచ్చి డాక్యుమెంట్ ను వివరించడం జరిగింది.
*మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ : బొత్స*
అమరావతి : సీపీఎస్ అంశంపై మూడ్రోజుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు . ఉపాధ్యాయ సంఘాల నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు . ” ఉద్యోగులతో రెండు అంశాలపై చర్చించాం . 670 ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలని సీఎం చెప్పారు . 248 ఉపాధ్యాయులను ఎంఈవోలుగా నియమిస్తాం . ముఖ ఆధారిత యాప్పై వస్తున్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం . మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ . ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తాం . టీచర్లపై పెట్టిన కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం ” అని బొత్స తెలిపారు .
🪷🪸🪷🪸🪷🪸
WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!