మండలానికి ఇద్దరు విద్యాధికారులు: ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి బడుల నిర్వహణ
*📚✍️మండలానికి ఇద్దరు*
*విద్యాధికారులు✍️📚*
*♦️ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి బడుల నిర్వహణ*
*♦️పాఠశాల విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్*
*🌻ఈనాడు, అమరావతి:* పాఠశాలల పర్యవేక్షణకు మండలానికి ఇద్దరు విద్యాధికారులు చొప్పున నియమించాలని సీఎం జగన్ ఆదేశిం చారు. మండల విద్యాధికారుల్లో ఒకరికి అకడ మిక్ వ్యవహారాలు, మరొకరికి పాఠశాలల నిర్వ హణ అంశాలు అప్పగించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ… ‘నాడు- నేడు పనులు పూర్త యిన బడుల్లో కల్పించిన సౌకర్యాలు బాగు న్నాయా? లేదా? అన్నది నెలకోసారి పరిశీలించాలి. అవసరమైన చోట వెంటనే మరమ్మ తులు చేయించాలి. ఎలాంటి సమస్యలున్నా తెలియజేసేందుకు వీలుగా ఫోన్ నంబరును బడుల్లో ప్రదర్శించాలి. వచ్చే ఏడాది జూన్ లో పాఠశాలలు తెరిచే నాటికి విద్యా కానుకను పిల్లలకు కచ్చితంగా అందించాలి. ఏకరూప దుస్తుల కుట్టు ఛార్జీలను ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలి. బడుల నిర్వహ ణలో తల్లిదండ్రుల కమిటీలు, సచివాలయ ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలి. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలి. వీటిపై ఎప్పటికప్పుడు నివేది కలు అందించాలి. ప్రతివారం పాఠశాలను సంక్షేమ, విద్య సహాయకులు, మహిళా పోలీసు, నెలకోసారి ఏఎన్ఎం సందర్శించాలి’ అని ఆదేశించారు.
*♦️మార్చినాటికి తొలిదశ డిజిటలైజేషన్*
‘ఎనిమిదో తరగతి విద్యార్థుల కోసం 5,18,740 ట్యాబ్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. వీటిల్లో బైజూస్ కంటెంట్ వేసి అందించ నుంది. తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీలను దశల వారీగా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 72,481 స్మార్ట్, ఇంటరాక్టివ్ టీవీలు అవసరం కానున్నాయి. వీటి ఏర్పాటుకు రూ.512కోట్లకుపైగా నిధులు అవసరం. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతి గదుల డిజిటలైజేషన్ పూర్తయ్యేలా చూడాలి. అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. డిజిటల్ గ్రంథాలయాలతో సహా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ అన్నింట్లోనూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇