NSP: NATIONAL SCHOLORSHIP PORTAL STUDENTS REGISTRATION, INSTITUTE LEVEL VERIFICATION, DISTRICT LEVEL D.E.O/NODAL OFFICER VERIFICATION PROCESS
జాతీయ ఉపకార వేతన పరీక్ష
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్:
ఈ పరీక్షలో ఎంపికైన ప్రతి విద్యార్థి తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనే కేంద్ర వెబ్ సైట్ నందు
వారి వివరాలు తప్పకుండా నమోదు చేసుకోవాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాతి సంవత్సరమే
తప్పకుండా ఈ నమోదు ప్రక్రియ చేయాలి. లేనిపక్షంలో స్కాలర్షిప్ మంజూరు కాబడదు.
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు నమోదు ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.
(1) స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు సమర్పించుట:
ముందుగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. ఆధార్ వివరములు
నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేయవలెను. రిజిస్ట్రేషన్ చేసిన తరువాత చరవాణి వచ్చిన యూజర్ నేమ్,
పాస్ వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అయ్యి అప్లికేషన్ ను సమర్పించవలెను. దరఖాస్తు చేసుకునే
సమయంలో విద్యార్థి యొక్క వివరములు మెరిట్లిస్ట్ లోని వివరములతో సరిపోలవలెను. లేని పక్షంలో అప్లికేషన్
upload అవ్వదు . విద్యార్థి యొక్క ఆధార్ కార్డు లో పూర్తి పుట్టిన తేదీ నమోదు అయ్యి ఉండవలెను. రిజిస్ట్రేషన్
చేసేసిన తరువాత గనుక ఏమైనా తప్పులు ఉన్నట్టు గ్రహిస్తే, ఆ అప్లికేషన్ ను లాగిన్ అయ్యి Withdraw
Application ను ఎంపిక చెయ్యడం ద్వారా మరలా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశం
కలుగుతుంది. ఒకటికన్న ఎక్కువ అప్లికేషన్ లను సబ్మిట్ చేసిన విద్యార్ధి యొక్క అప్లికేషన్ లు అన్నీ రిజిస్ట్రేషన్
చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరుకు User Name మరియు Password లు SMS వస్తాయి. ఆ User
Name మరియు Password లను ఉపయోగించి లాగిన్ అయ్యి అప్లికేషన్ ని ఫిల్ చేయవలెను. ఆ విధముగా
ఫిల్ చేసిన అప్లికేషన్ ను చివరగా సబ్మిట్ చేయవలెను. సబ్మిట్ చేసిన అప్లికేషన్ ని ప్రింట్ తీసుకుని అప్లికేషన్
తో పాటు బ్యాంకు పాసుబుక్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ మొదలగు డాక్యుమెంట్లను జతపరచి ఒక కాపీని
పాఠశాల ప్రధానోపాధ్యాయునికీ మరియొక కాపీని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో
సమర్పించవలెను. అప్లికేషన్ లో ఇచ్చిన మొబైల్ నెంబరుకే OTP లు వస్తాయి గనుక అదే నెంబరు ను
నాలుగు సంవత్సరాల వరకు పనిచే విధంగా చూసుకొనవలెను.
ఏ విద్యార్ధి అయినా వేరే స్కీం (Other Welfare Schemes) లో స్కాలర్షిప్ తీసుకుంటు ఉంటే
గనుక ముందుగా ఆ స్కీం కి లాగిన్ అయ్యి Withdraw Application అనే ఆప్షన్ ద్వారా ఆ స్కీం నుండి
Withdraw అవ్వాలి. అప్పుడు మాత్రమే NMMS స్కీం లో అప్లై చేసుకొనుటకు అవకాశం కలుగుతుంది.
> (2) స్కూలు లేదా ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్:
ప్రతి పాఠశాల వివరములను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు రిజిస్టర్ చేయవలెను. రిజిస్ట్రేషన్ చేసిన
పత్రమును సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారు Verify చేయవలెను. సంబంధిత జిల్లావిద్యాశాఖాధికారి
వారు Verify చేసిన తరువాత స్కూల్ ఉపాధ్యా మొబైల్ నెంబరుకు వచ్చిన వివరములతో లాగిన్ అయ్యి
Administration లో మొదటి ఆప్షన్ అయిన update profile ను ఫిల్ చేయవలెను.
Administration లో రెండవ ఆప్షన్ అయిన Add Updated Details లో గల Add and Update
Course Level ను, Add and Update Course ను, Add Annual Course Fee ను మరియు
Update Annual Course Fee ను ఫిల్ చేయవలెను అప్పుడు మాత్రమే Student Login లో విద్యార్థికి
School మరియు Class ఎంచుకొనుటకు వీలు కలుగును.
National Scholarship Portal లో సబ్మిట్ చేసిన ప్రతి అప్లికేషన్ ను సంబంధిత స్కూల్
ఉపాధ్యాయులు వారి స్కూల్ లాగిన్ ద్వారా Verify చేయవలెను. Verify చేయు సమయంలో విద్యార్థి
యొక్క Bank Passbook, Aadhar మొదలగు అన్ని ప్రతులను క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని వివరములు
సరిగా ఉన్న యెడల మాత్రమే Approve చేయవలెను. లేని పక్షంలో Defect అను Option ని క్లిక్ చేయడం
ద్వారా మరల స్టూడెంట్ లాగిన్ ద్వారా తప్పు ఎంట్రీలను సరిచేయవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ Reject
కొట్టకూడదు. Reject చేసిన దరఖాస్తు ఎప్పటికీ పరిగణనలోనికి తీసుకొనబడదు.
స్కూల్ లాగిన్ లో Approve చేసిన తరువాత పొరపాటును గుర్తించినట్లయితే సంబంధిత DEO
లాగిన్ లో Defect అనే ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా మరలా స్టూడెంట్ లాగిన్లో అప్లికేషన్ ని సరిచేసుకొనే
అవకాశం వస్తుంది. కనుక ఈ విధంగా చేసి అప్లికేషన్ లో ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకుని ఫైనల్
Submission చేయవలెను.
ప్రతి అప్లికేషన్ కూడా సంబంధిత స్కూల్ ఉపాద్యాయులు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి
వారు తప్పకుండా Verify చేయవలెను. అప్పుడు మాత్రమే విద్యార్థికి స్కాలర్షిప్ మంజూరు కాబడుతుంది.
కనుక సంబంధిత స్కూల్ ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకుని స్కూల్ మరియు DEO స్థాయిలో Verify
అయినదో లేదో పరిశీలించవలెను.
> (3) డి. ఇ. ఓ. లేదా డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్:
పాఠశాల లాగిన్ ద్వారా వెరిఫై అయిన దరఖాస్తులు డిస్ట్రిక్ట్ నోడల్ అఫీసర్ లాగిన్ ద్వారా తప్పకుండా
వెరిఫై చేయవలెను. దీనికొరకై విద్యార్థులు భౌతికంగా సమర్పించిన ఆధార్, బ్యాంకు పాస్ బుక్ మొదలగు
వాటిని పరిశీలించి సరిచూసిన తరువాత మాత్రమే డి.ఇ.ఓ లేదా డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా అప్రూవ్
చేయవలెను. ఈ విధంగా మూడు స్థాయిలలో వెరిఫై అయిన దరఖాస్తుదారులకు మాత్రమే ఉపకార వేతనం
మంజూరు చేయబడుతుంది.
ముఖ్య గమనిక:
మొదట ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ద్వారా National Scholarship Portal లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థి
తదుపరి సంవత్సరాలలో అనగా 10, 11, 12 తరగతులకు తప్పకుండ రెన్యువల్ చేసుకొనవలెను.
పదవతరగవతి తరువాత సంబంధిత కళాశాల వారు ఆ అప్లికేషన్ ను Verify చేయవలెను. 10 వ తరగతి
తరువాత విద్యార్థి చదువుతున్న కళాశాల వివరములు మరియు ఫోన్ నెంబర్ ను స్కాలర్షిప్ కు ఎంపిక అయిన
8 వ తరగతి చదివిన స్కూల్ వారికి తెలుపవలెను మరియు కళాశాల స్టడీసర్టిఫికెట్ ను సంబంధిత
విద్యాశాఖాధికారి వారి కార్యాలయం లో అప్లికేషన్ తో పాటు జతపరచవలెను.
National Scholarship Portal లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థి తన బ్యాంకు ఖాతాను 4
సంవత్సరాల కాలం Operative Stage లో ఉంచుకొనవలెను. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి
మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు స్కాలర్షిప్ డిపాజిట్ చేసే సమయానికి బ్యాంకు అకౌంట్ Dormant
(Inoperative Stage) లో గనుక ఉన్నట్లయితే ఇక ఎప్పటికీ స్కాలర్షిప్ జమచేయబడదు కనుక దీనిని
గమనించగలరు.