AP టీచర్స్: September 1 నుంచి టీచర్లు యాప్లో హాజరు తప్పనిసరిగా వేయాలి

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*📚✍️1 నుంచి యాప్ హాజరు*
 *తప్పనిసరి✍️📚*

*♦️ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు*

*♦️ప్రభుత్వం స్పందించాలంటున్న టీచర్లు*

*♦️లేకుంటే 2 నుంచి ‘యాప్ డౌన్’: ఫ్యాప్టో*

*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయుల ముఖ ఆధా రిత హాజరుపై అటు ఉపాధ్యాయులు ఇటు విద్యాశాఖ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబరు 1. నుంచి తప్పనిసరిగా యాప్లో హాజరు వేయాలని పాఠ శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయగా.. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యాశాఖలోని అధికారులు, సిబ్బంది, ఉపాధ్యా యులు అంతా ఇదే యాప్ హాజరు వేయాలని, ఆగస్టు 31లోపు ఉపాధ్యాయులంతా యాప్లో నమోదు. చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. దీనిపై అభ్యం తరం వ్యక్తం చేసిన ఫ్యాస్ట్తో ఉపాధ్యాయులెవరూ సొంత ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకోవద్దంటూ ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో ఆగస్టు 18న మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చల్లో ఆగస్టు 31 వరకు ప్రయోగాత్మకంగా హాజరు వేయాలని, తర్వాత సంఘాలతో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఆ గడువు బుధవారంతో ముగియనుండగా… పాఠశాల విద్యాశాఖ సెప్టెంబరు 1 నుంచి యాప్ తప్ప నిసరి అని ఆదేశాలు జారీ చేసింది. మరోసారి సమావే శమవుదామని మంత్రి బొత్స హామీ ఇవ్వగా.. ఈలోపే విద్యాశాఖ యాప్ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చేసిం దని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకటో తేదీలోపు స్పష్టత ఇవ్వకపోతే రెండో తేదీ నుంచి యాప్ లను డౌన్ చేయాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది.

*♦️ఒక యాప్.. అనేక సమస్యలు..*

రాష్ట్రంలో 1,85,090 మంది ఉపాధ్యాయులున్నారు. విద్యార్థుల హాజరు నమోదు సైతం యాప్లోనే పెట్ట డంతో తప్పనిసరై 1,35,816 మంది డౌన్లోడ్ చేసుకు ఉన్నారు. ఉదయం అందరూ ఒకేసారి హాజరు వేస్తుంటే సర్వర్ సమస్య ఏర్పడుతోందని ఉపాధ్యా యులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. సొంత సెల్ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల సమాచార మంతా ప్రభుత్వానికి వెళ్లిపోతోందని, సీపీఎస్ ఆందో శనను భగ్నం చేసేందుకు పోలీసులు ఈ యాప్ సమాచారం సేకరించారని ఆరోపిస్తున్నారు. హాజరు పడకపోతే జీతం కట్ చేస్తారని, దీన్ని సరిచే సుకునేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వమే డివైజ్లు ఇస్తే అభ్యం తరం లేదని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ‘నాడు-నేడు! , మరుగుదొడ్ల పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, విద్యా ర్ధుల హాజరును ఉపాధ్యాయులు యాప్లో నమోదు చేస్తున్నారు. ఇవికాకుండా విద్యాకానుక, బెస్లైన్ పరీక్షలు, చైల్డ్ ఇన్ఫో వివరాలను ఆన్లైన్లో ఇస్తు న్నారు. ఈ యాప్లను డౌన్ చేస్తే విద్యాశాఖకు సమాచారం నిలిచిపోతుంది.

*♦️ప్రభుత్వం డివైజ్లు ఇవ్వాలి.*

‘ప్రభుత్వం డివైజ్లు ఇస్తే తప్పకుండా హాజరు నమోదు చేస్తాం. ముఖ ఆధారిత హాజరులో అనేక ఇబ్బందులున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో పరిష్కరిం చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే డివైజ్లు ఇచ్చే వరకు యాప్లో హాజరును స్వచ్ఛందం చేయాలి. ‘

*▪️- వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఫ్యాప్టో*

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️ఫోన్‌ యాప్‌ ద్వారానే*

 *టీచర్ల హాజరు✍️📚*

*♦️రేపటి నుంచే ప్రారంభం*  

*♦️దృష్టి లోపం ఉన్నవారికి మినహాయింపు* 

*♦️టీచర్లంతా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి*

*♦️పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు* 

*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలో ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటిగ్రేటెడ్‌ అటెండెన్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానంలో హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్‌ జారీ చేసింది. ఫోన్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని తెలిపింది. వీరితోపాటు పాఠశాల విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని వెల్లడించింది.

♦️సెప్టెంబర్‌ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్‌ హాజరును నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం.. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వివరించింది. వారు ప్రత్యేకంగా మాన్యువల్‌ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. కాగా, ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని నెల రోజుల్లో అన్ని విభాగాల్లో అమలు చేయనున్నారు.   

*♦️ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేకపోతే..*

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లేని టీచర్లు, ఉద్యోగులు తమ హాజరును హెడ్మాస్టర్‌ లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్స్‌ ద్వారా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్లను బుధవారంలోపు పూర్తి చేయాలని తెలిపింది.

*♦️యాప్‌ ద్వారా హాజరు నమోదు..* విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, జోన్, జిల్లా కార్యాలయాలు, డైట్స్, ఎంఈవో తదితర కార్యాలయాలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చూడాలని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్లు, డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశించింది. హాజరును క్రమం తప్పకుండా యాప్‌ ద్వారా నమోదు చేసేలా చూడాలని పేర్కొంది.    

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️1 నుంచి ముఖ హాజరు*

 *తప్పనిసరి✍️📚*

*♦️ఫోన్‌ లేకపోతే… హెచ్‌ఎం ఫోన్‌లో వేయండి*

*♦️ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ*

*♦️డివై్‌సలు కోరుతున్న ఉపాధ్యాయ సంఘాలు*

*♦️చర్చల్లో ఏమీ తేల్చకుండానే అమలుకు మళ్లీ సన్నాహాలు*

*🌻అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి):* బోధన, బోధనేతర ఉద్యోగులందరూ సెప్టెంబరు 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ముఖ హాజరు విధానంలోనే హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది. బుధవారం నాటికి ప్రతి ఒక్కరూ ఫేసియల్‌ అంటెడెన్స్‌ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది. ఉపాధ్యాయులతోపాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రాష్ట్రస్థాయి కార్యాలయాలు, ఆర్జేడీ కార్యాలయాలు, డీఈవో, ఎంఈవో కార్యాలయాలతోసహా అన్నిటికీ ఈ విధానం తప్పనిసరి అని పేర్కొంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సురేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేని టీచర్లు, ఉద్యోగులు పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు లేదా ఇతర ఉపాధ్యాయుల ఫోన్లలో హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. అంధులకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంటుందని, వారి కోసం విడిగా రిజిస్టర్‌ నిర్వహించాలని ఆదేశించారు.పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా తప్పనిసరిగా దీనిని అమలుచేయాలని, మాన్యువల్‌ హాజరు విధానం అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా దీనిపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత కొనసాగుతోంది. ముఖ హాజరు వేసేందుకు డివై్‌సలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం డివై్‌సలు ఇస్తే ముఖ హాజరు విధానాన్ని అమలుచేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీనిపై గందరగోళం నెలకొనడంతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఈనెలాఖరు వరకు దానిని ఉపయోగించాలని, అప్పటికీ ఇబ్బందులుంటే మరోసారి సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం డివై్‌సలు ఇస్తేనే హాజరు వేస్తామని సంఘాలు మంత్రికి తేల్చి చెప్పాయి. దీంతో అప్పటి చర్చలు అసంపూర్ణంగానే ముగిశాయి.

♦️అనంతరం ముఖ హాజరుకు 10 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ను తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఆఫ్‌లైన్‌ విధానంలోనూ హాజరు వేయాలని, ఈనెల 31 వరకు పైలెట్‌ ప్రాజెక్టుగా కొనసాగుతుందని తెలిపింది. ఇప్పటికీ ప్రభుత్వమే డివై్‌సలు ఇవ్వాలని టీచర్లు పట్టుబడుతున్నారు. యాప్‌ను వినియోగించకూడదని సంఘాలు భావిస్తున్నాయి. అవసరమైతే హాజరుతోపాటు ఇతర యాప్‌లు కూడా వాడకుండా నిరసన తెలపాలనే ఆలోచనలో ఉన్నాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!