22.08.2022పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నిర్వహించిన WebEx సమావేశం ముఖ్యాంశాలు
22.08.2022
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నిర్వహించిన WebEx సమావేశం ముఖ్యాంశాలు
🔹చైల్డ్ ఇన్ఫో అప్డేషన్:
గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రతి జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కలిపి చైల్డ్ ఇన్ఫో ఎన్రోల్మెంట్ నందు సుమారు 1000 వరకు విద్యార్థుల సంఖ్య తగ్గినది. ఆ విధంగా విద్యార్థులు తగ్గడానికి గల కారణాలు విశ్లేషించాలి. ప్రైవేట్ పాఠశాలలు కూడా చైల్డ్ ఇన్ఫోనందు విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. లేనియెడల సదరు విద్యార్థులకు అమ్మబడి వర్తించే అవకాశం ఉండదు.
🔹టీచర్ అటెండెన్స్:
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 54 శాతం మంది టీచర్లు మాత్రమే రిజిస్టర్ అయ్యారు. ఈనెల 31 వరకు పైలెట్ ప్రాజెక్టు లాగా దీన్ని జరుపుతున్నాము. ఒక నిమిషం హాజరు నిబంధన తొలగించి 10 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చాము. మూడుసార్లు ఆలస్యం అయితే హాఫ్ డే CL కట్ చేయడం జరుగుతుంది. అందరూ కచ్చితంగా రిజిస్టర్ అయ్యి సాంకేతిక ఇబ్బందులను పై అధికారులు తెలియజేస్తే వాటిని సవరించే ప్రయత్నం చేస్తాము. సెప్టెంబర్ 1 నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ ఆధారిత హాజరు అమలు చేస్తాము.
🔹UDISE UPDATION:
UDISE అప్డేషన్లో తరగతి గదులు లేవని, ఉపాధ్యాయులు లేరని, శిక్షణ లేని ఉపాధ్యాయులు బోధించుచున్నరని, ఫర్నిచర్ లేవని ఇలా రకరకాల అంశాలు నమోదు చేశారు వీటిని మరల ఒకసారి క్రాస్ చెక్ చేసి సరి చేయాలి.
🔹నాడు నేడు:
ముఖ్యమంత్రి గారి సమీక్షలో మొదటి విడత నాడు నేడు పాఠశాలల మెయింటెనెన్స్ గురించి ఫిర్యాదులు వస్తున్నట్లుగా తెలియజేశారు. ఆర్ వో వాటర్, బాత్రూం మెయింటెనెన్స్ , పెయింట్స్ & గ్రీన్ బోర్డు మెయింటెనెన్స్ జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించి 26 అంశాలతో కూడిన ఒక ప్రశ్నావళి యాప్ నందు పంపడం జరుగుతుంది దాన్ని సదరు HM లందరూ పూర్తి చేయాలి.
నాడు నేడు రెండు సంబంధించి అదనపు తరగతి గదులు నిజంగా ఎన్ని అవసరమో మరోసారి క్రాస్ చెక్ చేసి అవసరం లేని గదులను నిర్మాణం చేపట్టరాదు. వాటిని UDISE ప్రకారం తరగతి గదులు అసలు లేని పాఠశాలలకు కేటాయింపు చేసుకునవచ్చు.
🔹JVK:
జగనన్న విద్యా కానుక సంబంధించి మెటీరియల్ జిల్లా స్థాయి నుంచి పాఠశాల స్థాయికి చేరడానికి ఎక్కువ సమయం పడుతున్నది. ఆ సమయం తగ్గించాలి. షూస్ మినహా దాదాపు అన్ని వస్తువులు విద్యార్థులకు చేరాయి. యాప్ నందు బయోమెట్రిక్ అప్డేషన్ వేగంగా పూర్తి చేయాలి.
🔹NMMS:
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ సంబంధించి ఫ్రెష్ మరియు రెన్యువల్ దరఖాస్తులను ఆగస్టు 31 లోపు జాతీయ స్కాలర్షిప్ వెబ్సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేయాలి.
🔹 పాఠశాల , ఎం ఆర్ సి, సి ఆర్ సి గ్రాంట్లు త్వరలో విడుదల కానున్నాయి.
🌹
You might also check these ralated posts.....